Linguistics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Linguistics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

01 జూన్, 2013

ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము Praudha Vyakarana Ghanta patham

ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము
 Praudha Vyakarana Ghanta patham
వంతరాం రామ కృష్ణా రావు  Vantaraam Rama Krishna Rao 





ముక్త లక్షణ కౌముదీ కారులైన వంతరాం వారు ఘంటాపథమను పేర వ్యాఖ్యానం వ్రాసారు. ఆ విశిష్ట గ్రంథమే ఇది.
ఈ పుస్తకం వ్యాకరణాధ్యేతలకు ఉపయోగకరం.

31 మే, 2013

బాల ప్రౌఢ వ్యాకరణ విశ్లేషణాత్మక అధ్యయనం Analytical Study Of Bala & Praudha Vyakaranas

బాల ప్రౌఢ వ్యాకరణ విశ్లేషణాత్మక అధ్యయనం
Analytical Study Of Bala & Praudha Vyakaranas 
ఆచార్య హరి శివ కుమార్  Prof. Hari Shiva Kumar

బాల ప్రౌఢ వ్యాకరణాల విషయాంశాలను అధ్యయనం చేయాల్సిన పద్ధతిని, సులువుగా అర్థమయ్యేట్టు హరిశివ కుమార్ గారు చక్కగా నిరూపించారు. ఈ పుస్తకం వ్యాకరణాధ్యేతలకు ఉపయోగకరం.

30 మే, 2013

బాలవ్యాకరణ సూక్తులు 3 Bala Vyakarana Suktulu

బాలవ్యాకరణ సూక్తులు 3
 Bala Vyakarana Suktulu 3
డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Naga Bhushanam

ప్రముఖ వ్యాకరణాచార్యులు డా. అంబడిపూడి నాగభూషణంగారు బాలవ్యాకరణానికి ఉన్న రెండు ప్రముఖ వ్యాఖ్యానాలైన ఉద్ద్యోతం, సంజీవనీ లలోని విషయాలను పరామర్శిస్తూ వ్రాసిన గ్రంథమిది. ఇది మూడు భాగాలుగా వెలువడగా ప్రస్తుతం మన తెలుగుపరిశోధనలో ప్రథమ,తృతీయ భాగాలు మాత్రమే లభిస్తున్నాయి.

29 మే, 2013

బాలవ్యాకరణ సూక్తులు 1 Bala Vyakarana Suktulu

బాలవ్యాకరణ సూక్తులు 1 
Bala Vyakarana Suktulu 1
డా. అంబడిపూడి నాగభూషణం Dr.Ambadipudi Nagabhushanam



ప్రముఖ వ్యాకరణాచార్యులు డా. అంబడిపూడి నాగభూషణంగారు బాలవ్యాకరణానికి ఉన్న రెండు ప్రముఖ వ్యాఖ్యానాలైన ఉద్ద్యోతం, సంజీవనీ లలోని విషయాలను పరామర్శిస్తూ వ్రాసిన గ్రంథమిది. ఇది మూడు భాగాలుగా వెలువడగా ప్రస్తుతం మన తెలుగుపరిశోధనలో ప్రథమ,తృతీయ భాగాలు మాత్రమే లభిస్తున్నాయి.

28 మే, 2013

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని Praudha vyakarana Dig darshini

ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని
              Praudha vyakarana Dig darshini
     డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Nagabhushanam

తెలుగులో వ్యాకరణంలో చిన్నయ సూరి రచించిన బాల వ్యాకరణం ప్రసిద్ధం. దాని తర్వాత వారి శిష్యులు బహుజనవల్లి సీతా రామా చార్యులవారు రచించిన ప్రౌఢవ్యాకరణం ప్రసిద్ధం. బాల వ్యాకరణం లో చెప్పగా విడిచిన విషయాలను చెప్పడానికి, అందులో చెప్పిన విషయాల సవరణకూ తాను ఆ గ్రంథం ప్రారంభించానని చెబుతారు ఆచార్యుల వారు.

ఈ వ్యాకరణ గ్రంథం పేరుకు తగినట్లుగా ప్రౌఢం. సులువుగా అర్థమయ్యేది కాదు. అటువంటి ఈ గ్రంథానికి ప్రసిద్ధ వ్యాకరణ పండితులు బాలవ్యాకరణ సూక్తులు గ్రంథ రచయిత డా. అంబడిపూడి నాగభూషణం గారు దిగ్దర్శిని వ్యాఖ్యతో విద్యార్థులకు ఉపకారం చేసారు. ఇందులో ప్రతిసూత్ర వ్యాఖ్య లేకున్నా, అవసరమైన అన్ని సూత్రాలనూ వ్యాఖ్యానించారు.

27 మార్చి, 2013

బాల వ్యాకరణం Bala vyakaranam





బాల వ్యాకరణం (బాలవ్యాకరణ సారస్య సర్వస్వ సహితం)
Bala Vyakaranam (with commentary )
Chinnaya Suri

చిన్నయ సూరి వ్యాకరణానికి దూసి రామమూర్తి శాస్త్రి గారి బాలవ్యాకరణ సారస్య సర్వస్వ సహితం గా ఇక్కడ మీకు అందిస్తున్నాము.

07 మార్చి, 2013

తెలుగు భాషా చరిత్ర History of Telugu language

తెలుగు భాషా చరిత్ర
 History of Telugu language 
Telugu Bhasha Charitra
సేకరణ- భద్రిరాజు కృష్ణమూర్తి



 
Bhadriraju Krishna Murti 
తెలుగులో వెలువడిన మొట్టమొదటి తెలుగు భాషా చరిత్ర ఇది.
తెలుగు, తెనుగు, ఆంధ్రం అనే పదాల పుట్టుక మొదలుకొని ఆధునిక కాలంలోని వ్యావహారిక వాదం, మాండలికాలు వరకు తెలుగు భాషలో వచ్చిన రకరకాలైన మార్పులను ఈ గ్రంథం లో మీరు చదువ వచ్చు. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి. 

అనుసరించువారు