Reference Book లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Reference Book లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30 జులై, 2013

భారతీ నిరుక్తి Bharathi Nirukthi

భారతీ నిరుక్తి Bharathi Nirukthi
హరిసోదరులు Hari Sodarulu

భారతీ అంటే వేదభారతి. వేదానికి రక రకాలైన పేర్లున్నాయి. వేద సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సంప్రదాయానుసారంగా వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేదానికి ఉన్న ఆయా పేర్లను గూర్చిన విపులవిచారణ చేయడంద్వారా వేద సంప్రదాయాన్ని చక్కగా పరిచయంచేసారు హరిసోదరులు.

26 జులై, 2013

అవతార మీమాంస Avathara mimamsa

అవతార మీమాంస
Avathara mimamsa 

ముదిగొండ మల్లికార్జున రావుగారు Mudigonda Mallikarjuna Rao

అవతారాలనుగూర్చి విమర్శించేవారు చదువాల్సిన గ్రంథమిది. ఇందులో ముదిగొండ మల్లికార్జున రావుగారు భగవంతుని అవతారాల ఆవశ్యకత,రహస్యం పరమార్థాన్ని చక్కగా వివరించారు. అవతారాలను నమ్మేవారికీ పారాయణ గ్రంథమిది.

25 జులై, 2013

అవధాన మంజరి Avadhana manjari

అవధాన మంజరి
 Avadhana manjari
ప్రతాప వేంకటేశ్వర కవి Prathapa Venkateshwara kavi

ప్రతాప వేంకటేశ్వర కవి గారు వివిధ ప్రదేశాల్లో చేసిన అవధానాలు ఒక దగ్గర కూర్చిన మణిహారం. 27 అవధానాలు ఇందులో ఉన్నయి.

22 జులై, 2013

ఆశు కవితలు - అవధానాలు - చాటు కవితలు Asu Kavithalu - Avadhaanalu - Chatu kavithalu

ఆశు కవితలు - అవధానాలు - చాటు కవితలు
Asu Kavithalu - Avadhaanalu - Chatu kavithalu

కేతవరపు రామకోటి శాస్త్రి - Kethavarapu Ramakoti Shasthri

తెలుగు వారు అవధానాలకు ఆరంభకులు. తెలుగులో అవధానాలు, చాటువులు ఇవి ఆశుకవిత్వానికి సంబంధించినవి. వీటిపై ప్రామాణికమైన రచన చేసి కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనకు అందించారు. అందుకోండి ఈ కానుక.

25 జూన్, 2013

పోతన సాహిత్య గోష్ఠి Pothana Sahithya Goshthi

పోతన సాహిత్య గోష్ఠి  
Pothana Sahithya Goshthi


పోతన పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సాహిత్య గోష్ఠిలో వివిధ పండితులు వివిధ అంశాలపై సమర్పించిన పదునాలుగు వ్యాసాలు ఇందులో ఉన్నాయి. రసికులైనవారికి అపురూపమైన మందార మకరందం.

15 జూన్, 2013

విజ్ఞాన సర్వస్వం - దర్శనములు మతములు 4 Encyclopedia in Telugu - Darshanas and Religions

విజ్ఞాన సర్వస్వం - దర్శనములు మతములు
Encyclopedia in Telugu - Darshanas and Religions 


మతములు దర్శనములు అనే ఈ విజ్ఞాన సర్వస్వం తత్వ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలను అందిస్తుంది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

14 జూన్, 2013

విజ్ఞాన సర్వస్వం - విశ్వ సాహితి 5 Encyclopedia (in Telugu)- World Literature

విజ్ఞాన సర్వస్వం - విశ్వ సాహితి 5
 Encyclopedia (in Telugu)- World Literature


తెలుగు విశ్వ విద్యాలయంవారు విజ్ఞాన సర్వస్వాలు ప్రచురించడం ఆరంభించాక సాహిత్యానికి సంబంధించిన వాటిని మూడు భాగాలు గా చేసారు.
1.తెలుగు సాహితి - (ఇది తెలుగు సాహిత్య విషయ సర్వస్వం )
2.భారత భారతి -( ఇది తెలుగును మినహాయించి, మిగిలిన భారతీయ భాషల సాహిత్య విషయ సర్వస్వం)
3.విశ్వ సాహితి - ( ఇది భారతీయ భాషలను మినహాయించి, మిగిలిన ప్రపంచ భాషల సాహిత్య విషయ సర్వస్వం)

అనుసరించువారు