గతంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ కాలంలో విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అన్నీ విషయాల్లో కనీస పరిజ్ఞానం కలుగాలనే ఉద్దేశంతో పండితులచే వ్రాయించి, ప్రచురించిన గ్రంథమిది.
Kaumudi Sharad Agamanamu శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు Shri Appanna Joganna Shastri
సుప్రసిద్ధ వైయాకరణి శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు తెలుగువారిని అనుగ్రహించదలచి, సంస్కృతంలో భట్టోజీ దీక్షితులవారు రచించిన వైయ్యాకరణ సిద్ధాంత కౌముదీ గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానంతో (సమాస ప్రకరణం వరకు) అందించారు. ఆ అద్భుత గ్రంథాన్ని తెలుగువారికి అందించగలిగి తెలుగు పరిశోధన గర్విస్తుంది.
ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తెలుగుభాషగురించి, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం గురించి...... అన్ని విషయాలను వారు పాఠం చెప్పిన అనుభవంతో వ్రాసిన గ్రంథ రత్నమిది.
ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు తెలుగులో వెలువడిన పరిశోధనలపై గతంలో ఒక సమీక్షావ్యాసాల సంకలనం ప్రచురించింది. ఈ గ్రంథరాజం పరిశోధక విద్యార్థులకు, ఆచార్యులకు, తెలుగులో జరిగిన పరిశోధనలగూర్చి తెలిసికోదలచిన జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగకరం.