1990 సంవత్సరంలో శారదగారు ఆంధ్రావిశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడానికి సమర్పించిన సిద్ధాంత గ్రంథ మిది. ఇది కేవలం సిద్ధాంతగ్రంథమే కాదు, హరికథా ప్రక్రీయా సర్వస్వం అంటారు నండూరి రామకృష్ణమాచార్యులవారు.
హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఒక ద్వ్యర్థి కావ్యం. ప్రతి పద్యంలో హరిశ్చంద్రుని కథ, నలుని కథ ఉంటుంది.ఈ విధంగా ద్వ్యర్థి కావ్యం వ్రాయడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే రాయడమేంటి? చదివి అర్థం చేసుకోవడమే కష్టం. అందుకే ....ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ప్రఖ్యాత వ్యాకరణ పండితులు వజ్ఝల చిన సీతారామ శాస్త్రిగారి వ్యాఖ్యతో ఈ పుస్తకం మీకోసం.
భారతీ దేవిగారు వ్రాసిన నవల డాక్టరమ్మ. నవరత్న పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ రోజుల్లో నవలలు, కథలు చదవడం తగ్గింది కానీ, ఇది ప్రచురించబడిన 1980 ప్రాంతంలో ప్రజలు విపరీతంగా చదివే వారు. ఆ రోజుల్లో ఇంతగా టీవీలు కాని, ఇంటర్‌నెట్ కానీ లేకుండేవి. ఏది ఏమైనా కొత్త కొత్త టేక్నాలజి మనకు మేలుతో పాటు కొంత అనర్థాన్ని కూడా తెచ్చింది. అందులో పుస్తకపఠనం తగ్గడం. దాని వల్ల మనలో సృజనాత్మక లోపిస్తుంది అనేది మనం తెలుసుకుని, ప్రవర్తిస్తే మనం అదృష్టవంతులం.
కీర్తి అనేది తెల్లగా ఉంటుంది, అప కీర్తి నల్లగా ఉంటుంది మొదలైన భావనలను కవిసమయాలు అంటారు. కవులు వర్ణనలు చేయడానికి కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. వాటిని కవిసమయాలు అంటారు. ఆ విషయంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన వారు ఇరివెంటి కృష్ణ మూర్తి గారు. వారి సిద్ధాంతగ్రంథమే ప్రస్తుత గ్రంథం. ఇది చదివి తీరాల్సిన గ్రంథం. చదివాక మీరే అంటారు " అబ్బో! చదువకుండా ఉంటే ఎంత నష్టపోయేవాళ్ళం" అని.
కట్టమంచి రామ లింగా రెడ్డి Kattamanchi Rama Linga Reddy
తెలుగులో వెలువడిన మొట్టమొదటి ఆధునిక సాహిత్యవిమర్శ కట్టమంచి రామ లింగా రెడ్డి గారు వ్రాసిన కవిత్వ తత్వ విచారము. పింగళి సూరన వ్రాసిన కళాపూర్ణోదయం అనే ప్రబంధాన్ని లక్ష్యంగా స్వీకరించి వ్రాసారు.