Pages

21 January, 2017

తెలుగు నాటక వికాసం Telugu NaTaka vikasasam

తెలుగు నాటక వికాసం Telugu NaTaka vikasasam
పోణంగి శ్రీరామ అప్పారావు Ponangi Sri Rama Appa Rao


పోణంగి శ్రీరామ అప్పారావు నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
అప్పారావు 1923 జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించాడు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యాభ్యాసం చేశాడు. ’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకుడు. భీమవరంరాజమహేంద్రవరంమద్రాసుకడప, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశాడు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశాడు.
అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో రాష్ట్ర నాట్య సామ్రాట్ బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే నాటక రత్న బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే కళారత్న బిరుదాన్ని అందుకున్నాడు.[1]
భరతముని ‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించాడు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇతర రచనలు తాజ్ మహల్ (నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము-జాతీయ బహుమతి పొందన గ్రంథం), నాటకరచనాప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్ పట్ట పరిశోధన వ్యాసము) నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషిచేసిన అప్పారావు 2005, జూలై 2న కన్నుమూశాడు.

To Download...........

12 comments:

  1. Sir book is not available here

    ReplyDelete
  2. ఇప్పుడు పని చేస్తుంది చూడండి

    ReplyDelete
  3. Pusthakamu paina i China kattu yendu nirveeryamainadi, dayachesi malli pettandi

    ReplyDelete

  4. Way cool! Some very valid points! I appreciate you penning this post plus the rest of the site is really good. gmail login

    ReplyDelete
  5. Sir telugu nataka Vikasmu pusthakanni download chesukolekapothunnanu

    ReplyDelete
  6. Sir Nenu nataka sahithyam py ph.D chesthunnanu Aa pusthakalni download chesukune margam thelupagalaraa

    ReplyDelete
  7. ఇప్పుడు లంకె సవరించాను. పనిచేస్తుంది. దిగుమతి చేసుకోండి. మీ పరిశోధనా కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.

    ReplyDelete
  8. ధన్యవాదాలు.... మీ ప్రోత్సాహక వచనాలకు నా నమస్సులు... ఇలాంటివే మరికొన్ని నాటక రంగానికి సంబంధించిన గ్రంథాలను నేను సేకరించుటలో నాకు సహాయపడగలరని ఆకాంక్షిస్తున్నాను

    ReplyDelete
  9. ధన్యవాదాలు.... మీ ప్రోత్సాహక వచనాలకు నా నమస్సులు... ఇలాంటివే మరికొన్ని నాటక రంగానికి సంబంధించిన గ్రంథాలను నేను సేకరించుటలో నాకు సహాయపడగలరని ఆకాంక్షిస్తున్నాను

    ReplyDelete
  10. తెలుగు విశ్వవిద్యాలయంవారు నాటక విజ్ఞాన సర్వస్వం ప్రచురించారు. మీకేమైనా ఉపయోగపడుతుందో చూసుకోండి.

    ReplyDelete
  11. నాట్యశాస్త్రం పిస్సార్ అప్పారావు గారి రచన పుస్తకం ప్రింట్ కాపి కొనుకొవడానికి కావాలి, ఎవరైన సమాచారం ఇవ్వగలరు 9490000805

    ReplyDelete