Pages

25 October, 2020

వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు - Vennamuddalu - Dr. Surya Ganapati Rao

వెన్న ముద్దలు - డా. సూర్య గణపతి రావు గారు  

 Vennamuddalu - Dr. Surya Ganapati Rao




డాక్టర్ దేవగుప్తాపు సూర్య గణపతి రావుగారు వృత్తిపరంగా వైద్యులు. కానీ, గొప్ప గొప్ప కవుల సరసన చేరదగిన చేయితిరిగిన కవి. అంతేకాకుండా గొప్పనైన సాహిత్య విమర్శకుడు. వారు రాసిన పాండురంగ మహత్యం యొక్క వ్యాఖ్య మీకు తెలుగు పరిశోధనలో అందుబాటులోనే ఉంది. కొమ్ములు తిరిగిన పండితులు కూడా తడబడేటువంటి ప్రౌఢ పదబంధాన్ని వ్యాఖ్యానించిన వారి నేర్పరితనం బహుధా ప్రశంసనీయం. అంతేకాదు, అన్నమయ్య కీర్తనలకు వారు చెప్పిన భాష్యం ఒక కొత్త అందాన్ని తెచ్చింది. దీనివల్ల వారికి తెనుగు పదాలతో ఉన్నటువంటి గాఢమైన పరిచయం మనం అర్థం చేసుకోవచ్చు.


ఇక, కవిత్వం విషయానికి వస్తే ఆయన భావాలు సుమధుర గంభీరాలు. ఎటువంటి వారినైనా భావ లోకాల్లో విహరింప చేసే గొప్ప నయినటువంటి మహత్తు అందులో ఉంది. ఎటువంటి వారినైనా వీరు తమ కవిత తో తలలు ఊచేటుగా చేస్తారు. 

మీరు రాసిన ఈ వెన్నముద్దలు కవితలు రోజు ఉదయాన్నే వాట్స్అప్ సందేశంలో నేను చదివే వాడిని. అది చదివిన నాకు పొద్దస్తమానం ఆ శ్రీ కృష్ణుని యొక్క అనుగ్రహం కలిగిన భావనతో గడిపేవాడిని. రోజు పొద్దుటే కొత్త వెన్న ముద్ద కోసం తహతహలాడే వాడిని. శతక మంతా పూర్తయి నది అని వారు తెలిసినపుడు నాకెంతో బాధేసింది, "అయ్యో రేపటి నుండి అమృతపు గుళికలు దొరకవు కదా" అని. 

ఏమైతేనేం, ఆ శ్రీకృష్ణుని చేతి వెన్నముద్దలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఈరోజు దసరా పండుగకు నిజంగా పండుగదనం  వచ్చింది. 


Vennamuddalu వెన్నముద్దలు by Dr.Panduranga Sharma Ramaka



దీనిని దిగుమతి చేసుకోవాలంటే -

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

2 comments:

  1. సూర్య గణపతి రావు గారు వ్రాసిన అన్నమయ్య పుస్తకం దొరుకుతుందా?

    ReplyDelete
  2. ఈ కింది లంకెలో చూడండి.

    http://www.teluguthesis.com/2019/11/tenepalukula-annamayya-drdevaguptapu.html

    ReplyDelete