ఇక్కడ వెతకండి

Widgets

శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) సమగ్రం Srimad Andhramaha Bhagavatamu (Complete)


                       
                     

తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనందరికి సులభంగా అర్థమయ్యేందుకు గాను చక్కని వ్యాఖ్యానంతో పోతనగారి భాగవతాన్ని ప్రచురించారు. ప్రస్తుతం దానినే మనకు విద్యుద్ గ్రంథంగా(E-Book) అందిస్తున్నారు.

తక్కువ బరువతో ఎక్కువ విషయంతో మీ అందరికీ తప్పక నచ్చే పుస్తకం.

అన్నట్టు మరవకండి పుస్తకం మీకు నచ్చి తీరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి.


  1. శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu 
  2. శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu 
  3. శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu 
  4. శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu 
  5. శ్రీమదాంధ్ర మహాభాగవతము (సవ్యాఖ్య) Srimad Andhramaha Bhagavatamu 
దీనిని కూడా చూడండి.
  పోతనభాగవతం - సార్థతాత్పర్యం 

3 comments:

Dada Hayat said...

సర్వసాధారణంగా వర్ణనాత్మక కావ్యాలకు వ్యాఖ్యానాలుంటాయి. భాషాపరమైన చమత్కారాలు, శ్లేషలు, అలంకారాలు, సంక్లిష్టతరమైన భావాలు ఇత్యాది విశేషాలు వాటిలో వుంటాయిగనక వ్యాఖ్యానాలు అవసరమవుతాయి. రామాయణ భారత భాగవతాలు ఆ కోవలోకి రావు. చెప్పాల్సింది సూటిగా సరళతరమైన భావాల్లో పాఠకుడికి సులభగ్రాహ్యమైన భాషలోనే మహాకవులు వాటిని రాశారు. కవి ఇక్కడ అత్యంత వినయశీలి. పాండిత్యప్రకర్ష ప్రదర్శించి అందరి మెప్పు పొందాలనే ఒకవిధమైన ప్రలోభానికి లోనయ్యే అవకాశం చాలా తక్కువ. అందుకే శాంతరసం ఇక్కడ ప్రధానంగా వుండి మిగతా రసాలు అంగిరసాలుగా భాసిస్తాయి. ఎలాంటి వ్యాఖ్యానాలు అవసరం లేకుండానే ప్రజల నాల్కలందు అవి నివసిస్తాయి. కాలక్రమేణా పోతనగారికి సైతం వ్యాఖ్య అవసరమైందని ఈ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? తెలుగువాళ్ళ మనసులకు యెంతో దగ్గరైన కవుల్లో పోతనగారొకరు. ఇన్నాళ్ళకు ఈ వ్యాఖ్య వచ్చిందని సంతోషించడమా? లేక పోతనగారికి వ్యాఖ్యా! అని వాపోవడమా? ఏది ఏమైనా పోతనగారు ఈ రూపేణా అయినా అందరికీ అందుబాటులోకి వచ్చారు. అందుకు సంతోషించాల్సిందే. ధన్యవాదాలు.

pandurangasharma ramaka said...

ఇంత విపులమైన, విశ్లేషణాత్మక వ్యాఖ్య రాసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇలా రాస్తే, ఎంత బాగుండు.

Dada Hayat said...

ఎందుకు రాయరు శర్మగారూ? ఎందరో మహానుభావులు. ఈ గ్రంథాల పైన పట్టు సాధించడానికి జీవితకాలాలు వెచ్చించిన వాళ్ళున్నారు. ఎటొచ్చీ అంతర్జాల సాంకేతికత వైపు దృష్టి మళ్ళించి వుండాలి గదా!

అనుసరించువారు