ఇక్కడ వెతకండి

Widgets

పోతన భాగవతం - సార్థతాత్పర్యం Pothana Bhagavatham (Sateeka)

పోతన భాగవతం - సార్థతాత్పర్యం 
Pothana Bhagavatham (Sateeka)


తిరుమల వేంకటేశ్వరస్వామి మరొకసారి తెలుగువారిని కరుణించి తెలుగువారి దోసిళ్ళలో అమృతాన్ని ధారవోశాడు. గతంలో భాగవతాన్నంతా తాత్పర్యంతో అందించి, అంతటితో తృప్తిపడక ఆ స్వామి మనమీదగల అవ్యాజమైన, అపారమైన కరుణతో భాగవతాన్నంతా ప్రతిపదార్థసహిత వ్యాఖ్యానంతో అందించారు.అవును పోతన ఏమడిగాడు? .....

''పద్యంబొక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యమ్ము భాషింపుమా !''  - అనికదా?


అందుకే కాబోలు ఆ ఏడుకొండలవాడు అంతపనీ చేశాడు. లేక, ఈనాటి మన అజ్ఞానాన్ని పసిగట్టి ఇలాగైనా బాగుపడండర్రా! అని కాబోలు. 


ఏమయితేనేం రసికులు దిగుమతి చేసుకోండి. వీలైతే కొని పెట్టుకొండి. (అన్నట్టు, నా ప్రతిని నేను ఇంట్లో భద్రం చేసుకున్నానండోయ్!) పోతన కవితామందారమకరందమాధుర్యాలు తనివితీరా ఆస్వాదించండి.

వరుసగా ఎనిమిది సంపుటాల్లో ఉంది. ఆ యా శీర్షికపై నొక్కగానె ఆ లంకె  మిమ్మల్ని సంబంధించిన పుటకు తీసుకెళ్తుంది.

  1.  పోతన భాగవతం - సార్థతాత్పర్యం
  2.  పోతన భాగవతం - సార్థతాత్పర్యం
  3. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
  4. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
  5. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
  6. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
  7. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
  8. పోతన భాగవతం - సార్థతాత్పర్యం
ఇక దిగుమతి చేసుకోవడమే మీవంతు. అన్నట్టు ఈ విషయాన్ని సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించండి. మీ స్నేహితులూ ఈ లాభం పొందవద్దూ?

చివరగా ఒక అభ్యర్థన.
ఈ కింది నా పరిశోధననూ పరిశీలించి, మీ ఆశీస్సులు అందించగలరని ....

 శ్రీమదాంధ్ర మహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు

0 comments:

అనుసరించువారు