తెలుగులో (అంతర్జాలంలో) లభిస్తున్న భాషా శాస్త్ర గ్రంథాలను ఒకే దగ్గర చేర్చే ప్రయత్నం తెలుగు పరిశోధన చేసింది. అవసరమున్న విద్యార్థులు, ఆచార్యులు దిగుమతి చేసుకుని ఆనందించండి.
ఇటీవల నవీకరించిన టపాలు
06 సెప్టెంబర్, 2026
భాషా శాస్త్ర గ్రంథాల సంగ్రహం Collection of books of Linguistics
లేబుళ్లు:
భాషా శాస్త్రం,
Linguistics
19 ఏప్రిల్, 2026
ఆంధ్ర మునిత్రయ తత్వదర్శనము - చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ Andhra Munitraya Tatva Darshanamu
సంస్కృత వ్యాకరణానికి పాణిని కాత్యాయన పతంజలులు ముని త్రయం. పాణిని సూత్రాలు వ్రాయగా, కాత్యానుడు కారికలు, పతంజలి మహాభాష్యాన్ని రచించారు. అదేవిధంగా తెలుగులో నన్నయ 'ఆంధ్ర శబ్ద చింతామణి' వ్రాయగా, అధర్వణ పండితుడు 'వికృతి వివేక' కారికలు, ఈ రెండు గ్రంథాలపై భాష్యంగా అహోబలపతి 'కవిశిరోభూషణము' రచించెను. ఈ నన్నయ, అధర్వణ, అహోబలపతులను సూత్ర వార్తిక భాష్యకారులను ముని త్రయంగా తెలుగు వ్యాకరణ పండితులు భావిస్తారు.
అటువంటి ఆంధ్ర ముని త్రయంపై అవగాహన రాహిత్యంతో రకరకాలైన ఆరోపణలు చేస్తూ ప్రాచీన తెలుగు వ్యాకరణ సంప్రదాయానికి కొందరు భంగం వాటిల్ల చేశారు. వారందరి వాదనలను ఖండిస్తూ, సంప్రదాయ పద్ధతిని సిద్ధాంతీకరిస్తూ ప్రసిద్ధ పండితులు డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ గారు రెండు భాగాలలో తమ సిద్ధాంత వ్యాస గ్రంధాన్ని నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు.
ఆ గ్రంథము -తెలుగు వ్యాకరణ శాస్త్రంపట్ల శాస్త్రీయమైన అవగాహన కల్పిస్తుంది. వ్యాకరణ శాస్త్ర జిజ్ఞాసవులు తప్పనిసరిగా చదవదగిన గ్రంథం.
దిగుమతి కొరకు గ్రంథ శీర్షికలపై నొక్కండి. 👇
లేబుళ్లు:
నాగార్జున విశ్వవిద్యాలయం,
ముని త్రయం,
వ్యాకరణం,
సిద్ధాంత గ్రంథం
02 మార్చి, 2026
శాస్త్రుల సద్గుణాబ్ధి విశ్వనాథ శతాబ్ది (శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి శతాబ్ది ఉత్సవ సంచిక)
శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు
బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రిగారి శతజయంతి ఉత్సవాలు సంవత్సరం అంతా ఘనంగా వారి శిష్యులు నిర్వహించారు. చివరగా వారి స్మారక సంచిక విడుదల చేశారు. అది 👇
శాస్త్రుల సద్గుణాబ్ధి విశ్వనాథ శతాబ్ది
లేబుళ్లు:
విశ్వనాథ శాస్త్రి,
వేదం,
శాస్త్రం,
శివంపేట,
సంస్కృతం
22 ఫిబ్రవరి, 2026
ఎమెస్కో వచన రామాయణం కోట వీరాంజనేయ శర్మ MSCO Vachana Ramayanam
శతావధాని కోట వీరాంజనేయ శర్మ గారిచే వ్రాయబడిన వచన రామాయణం 13 సంపుటాల్లో ఉంది. అవన్నీ ఒకే దగ్గర సమకూర్చి మీకోసం అందిస్తున్నాము.
దిగుమతికొరకు -
ఎమెస్కో వచన రామాయణం
లేబుళ్లు:
ఎమెస్కో,
కోట వీరాంజనేయ శర్మ,
తెలుగు,
రామాయణం,
వచన రామాయణం
03 ఆగస్టు, 2025
రామాయణ రహస్యాల సమీక్ష వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి Ramayana Rahasyala Sameeksha
ఇప్పుడు వారి మరో గ్రంథం రామాయణంపై కలుగే సందేహాలను శాస్త్రీయ పద్ధతిలో తీర్చే రామాయణ రహస్యాల సమీక్ష గ్రంథాన్ని అందిస్తున్నాం, ఆనందించండి.
దిగుమతి చేసుకోవాలంటే -
👉 రామాయణ రహస్యాల సమీక్ష 👈
పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు.
మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
ఆస్తికత్వము,
రామాయణం,
వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి,
సనాతన ధర్మం
26 జులై, 2025
సాహిత్య పదకోశము Dictionary of Literary Terminalogy
సాహిత్యం దృశ్య కావ్యం, శ్రావ్య కావ్యం అంటూ రెండు విధాలు. వీటికి సంబంధించిన సాహిత్య శాస్త్ర/ అలంకార శాస్త్ర సంబంధిత పారిభాషిక పదాలను అన్నింటినీ సేకరించి అకారాది క్రమంలో మనకు అందించారు తెలుగు అకాడమీవారు. ఇటువంటి అపురూపమైన శాస్త్ర గ్రంథాలు ఈమధ్య కాలంలో రావడం లేదు. ఈ గ్రంథం ప్రస్తుతం మార్కెట్లో దొరికే అవకాశం లేదు. ఈ గ్రంథం సాహిత్య శాస్త్ర అధ్యయనం చేసే విద్యార్థులకు, ఆచార్యులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
దీన్ని దిగుమతి చేసుకొని భద్రపరచుకోవాలి.
దిగుమతి చేసుకోవాలంటే -
సాహిత్య పదకోశము
లేబుళ్లు:
నిఘంటువు,
పదకోశం,
సాహిత్యం,
Dictionary,
Literature
17 జులై, 2025
ఆంధ్ర ప్రశస్తి (వివిధ కవుల కవితా సంకలనం) Andhra Prashasti (Collections of Telugu Poetry of various poets)
ఈ కింది తెలుగు పద్యం చూడండి.
వేదముల్ సంస్కృత వాదముల్ చేసిన తెలుఁగువాఁడే చేయవలయు ననఁగ
సంస్కృతచ్ఛందస్సు చక్కఁగా సాగింప తెలుఁగులోనే సాగవలయు ననఁగ
ఋతువులవద్దతి ఋజువుగా నుండఁగా నొకతెల్గునాటనే యుండు ననఁగ
నిఖిలసస్యములు పండింపఁగా దగినట్టి ధాత్రిలక్షణ మిందె తనరు ననఁగ
సర్వవేదాంతములకును జన్మభూమి
తూచిమనుజుఁడు తాల్చు దుస్తులకుఁ దగిన
దనుప్రమాణమ్ము చూపించి నట్టి నేల
తెలుఁగుధాత్రికి ధాత్రిలో దీటుఁగలదె?
తూచిమనుజుఁడు తాల్చు దుస్తులకుఁ దగిన
దనుప్రమాణమ్ము చూపించి నట్టి నేల
తెలుఁగుధాత్రికి ధాత్రిలో దీటుఁగలదె?
ఈ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారిది.
వివిధ కవులు వివిధ సందర్భాలలో తెలుగు జాతి, భాష, సంస్కృతులకు సంబంధించిన వ్రాసిన ఇటువంటి కవితలను సేకరించి ఆంధ్ర ప్రశస్తి పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించారు తెలుగు విశ్వవిద్యాలయం వారు.
ఆ అపురూపమైన పుస్తకం మీ కోసం......
👉 ఆంధ్ర ప్రశస్తి Andhra Prashasti 👈
11 జులై, 2025
సంపూర్ణ నీతి చంద్రిక Sampoorna Neethi Chandrika
సంస్కృతంలో విష్ణుశర్మ రచించిన 👉 పంచతంత్రంలో - 👈
- మిత్ర భేదం
- మిత్ర లాభం
- విగ్రహం
- లబ్ధ ప్రకాశం
- అపరీక్షిత కారకం
ఆ గ్రంథానికి తెలుగులో అనువాదమే నీతి చంద్రిక. ఈ నీతి చంద్రికలోని మొదటి రెండు తంత్రాలను చిన్నయసూరి తాను రాసిన బాల వ్యాకరణం గ్రంథానికి లక్ష్య గ్రంథంగా రచించారు. ఆ తర్వాతి మూడు తంత్రాలను కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం, సంధి (లబ్ధ ప్రకాశం, అపరీక్షిత కారకం) రచించారు.
ఆ సంపూర్ణ నీతి చంద్రికను కింద 👇అందిస్తున్నాం. చదివి ఆనందించండి.
👉నీతి చంద్రిక 👈
పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు.
మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
లేబుళ్లు:
కందుకూరి వీరేశలింగం,
చిన్నయసూరి,
నీతి చంద్రిక,
పంచ తంత్రము,
హితోపదేశం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





