28 February, 2013

తెలుగు పర్యాయ పద నిఘంటువు Dictionary for Telugu Synonyms

తెలుగు పర్యాయ పద నిఘంటువు Telugu Thesaurus


దీన్ని ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు కూర్చారు. ఈ నిఘంటువు తెలుగు పదాలకు పర్యాయ పదాలని సూచిస్తుంది. ఒకే అర్థం వచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు.అంగ్లంలో Synonyms అంటారు. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి. 

27 February, 2013

శబ్దరత్నాకరము -Shabda Ratnakam - (Telugu Dictionary)

తెలుగులో వెలువడిన ప్రముఖమైన తెలుగు-తెలుగు నిఘంటువు (Telugu-Telugu Dictionary).దీనిని బహుజనవల్లి సీతారామాచార్యులుగారు కూర్చారు. తెలుగువారెందరో దీనికోసం (PDF లో) వేచి చూసారు. మొట్టమొదటగా తెలుగుపరిశోధన వారే అందించారు. మళ్ళీ ఈ పుస్తకాన్ని తెలుగువారందరికోసం మరొక్కసారి అందిస్తున్నాము. Click On the button......
New Link Provided
శబ్దరత్నాకరము -Shabda Ratnakam - (Telugu Dictionary) 

26 February, 2013

మళ్ళీ వస్తున్న తెలుగు పరిశోధన

పునరను సంధానం 
 తెలుగువారికి సంస్కృతాంధ్ర గ్రంథాలను ఉచితంగా అందిస్తూ వచ్చిన తెలుగు పరిశోధన గత కొన్ని మాసాలుగా మూసి ఉంచడం వల్ల పుస్తకాభిమానులకు నిరాశ కలిగించింది. ఇక ఆ బెంగ అవసరం లేదు. తెలుగు పరిశోధన త్వరలోనే మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. ఇదివరకటిలాగానే మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మీ అభిమానమే మాకు ఊపిరి, ఉత్సాహం........ మీ అందరి అండ ఉంటే అదే మాకు పది వేలు.

అనుసరించువారు