తెలుగు భాషా సాహిత్యాలపై అభిమానమున్న ఎందరో మిత్రులు తమ వెబ్ సైట్స్ లో వివిధ శతకాలను అందిస్తూనే ఉన్నారు. వారందరూ అభినందనీయులే. అలాగే, మా దృష్టికి వచ్చిన శతకాల లంకెలను ఇక్కడ ఒక్కదగ్గర సంగ్రహింతామనిపించింది. ఇక్కడ మాకు కొత్తవి లంకెలు లభించినప్పుడల్లా చేరుస్తూనే ఉంటాము. మీరుకూడా లంకెలను సూచించవచ్చు.
సంస్కృతంలో శ్రీహర్షనైషధం నారికేళపాకం. నైషధం చదివిన సంస్కృత విద్యార్థి ఇంకే కావ్యం చదువకున్నా ఫర్వాలేదు. కొమ్ములు తిరిగిన పండితులకే టానిక్ అట ఈ కావ్యం.“నైషధం విద్వదౌషధమ్" అని ఆర్యోక్తి. అటువంటి నైషధ కావ్యం వ్యాఖ్యానం లెకుండా ఎలా అర్థమౌతుంది? మరి మన తెలుగువారికి తెలుగు లో వ్యాఖ్యానంతో అందించాలని సంకల్పించారు అప్పట్లో ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ వారు. లభించినంతవరకు అందించే ప్రయత్నం చేస్తాం.
వైదిక గ్రంథాలు తెలుగు లిపి లో లభించడం చాలా అరుదు. అటువంటి అపురూపమైన సాహిత్యం ఆసక్తి కలిగినవారి ఉపయోగార్థం తెలుగు పరిశోధన అందేట్టుగా చేస్తుంది. వీటిని అందించిన బ్రహ్మశ్రీ వి. రామలింగేశ్వర సుబ్రహ్మణ్య శర్మగారికి నమోవాకములు.