మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

తారాతోరణం - కవితా సంపుటి డా. దేవగుప్తాపు సూర్యగణపతి రావు Taratoranam


శ్రీ సూర్యగణపతి రావుగారు రసజ్ఞభారతి వ్యవస్ధాపక సభ్యులలో ఒకరు.

చి.సూర్యగణపతిరావు  తూ.గో.జిల్లా పెద్దాపురంతాలూకాలో కాట్రావులపల్లి అనే చిన్న గ్రామంలో జననం.హైస్కూల్ చదువు, మెడిసిన్ కాకినాడలో తర్వాత  ఛండీఘర్ లో.

ప్రస్తుతం రేడియాలిజిష్టు గా విశాఖపట్నం లో ఉద్యోగ బాధ్యతలు

వృత్తి రీత్యా డాక్టరైనా ప్రవృత్తి సాహిత్య వేత్త


రవి చూడనివి చూడ గల కవి

భగవదనుగ్రహం పరిపూర్ణంగా కలవాడు


ఆత్మ లోకంలో విహరించి కవిత్వాన్ని ఆ పర దేవతను దర్శించడానికి ఉపాధిగా తీసికొన్న వాడు


సాహిత్య చర్చలు..సాహితీ వ్యాసాలు ఇతనికి అత్యంత ప్రీతి పాత్రం


ఎన్నో రచనలు అలవోకగా చేసాడు..చేస్తున్నాడు


కొన్ని రచనలు


త్రివేణి

అలమేల్మంగ శతకము.

శివశతకము

శారదాంబశతకము

దివ్య లోచనశతకములు

రవిశతకము

చందమామశతకము

మకుటంలేని మహారాజులు 


బులుసు వేంకటేశ్వర్లు గారి మాటల్లో...


 అంబ నవా0బుజో జ్జ్వలకృపానన

                యై రస చంద్ర చంద్రికా

డంబరమూర్తి.ఔచు ప్రకటస్పుట

                భూషణ రత్న రమ్య భాక్

చుంబితవాగ్విశేషముల  చూరల నీయ

                    కవిత్వతత్వ భా

 వా0బర వీధి విశ్రుత విహారి గణేశకవిన్ 

                                 నుతించెదన్!!

                     

శ్రీ దేవగుప్తాపు సూర్య గణపతికవి గారు 1961 లో

 జన్మించారు. వీరి జనని  ,శ్రీమతి విజయ

లక్షమ్మ గారు,  జనకులు. కీ.శే.  కూటంరాజు గారు .

 వీరి అన్నగారు ప్రసిద్దవైద్యులు శ్రీ కృష్ణప్రసాద్ గారు.

 తల్లిదండ్రుల శిక్షణ,గురువుల దయతో  అన్నదమ్ములు

ఇరువురు సాహిత్య ప్రియులుగా, చదువులో అగ్రేసరులుగా  నిలిచి వంశము పేరు నిల్పినారు.

                ప్రస్తుత మన కథానాయకులు  వినాయక 

చతుర్థి పర్వదినమున విజయలక్ష్మీ గర్భ శక్తి ముక్తాయ

మానంగా జనించిన కారణంగా సూర్య గణపతు లైనారు. ఆదేవుని వలెనే విద్యల కెల్ల  నొజ్జ యైనారు.

      వీరి సాహిత్యగురువులు శ్రీ బేతవోలు రామభ్రహ్మంగారు, కూర్చుమిత్రులు శ్రీ గరికపాటి వారు.

సహజ వినయ భాగ్యం కల శ్రీ గణపతి గారు విశాఖ పట్టణమున  ప్రముఖ"రేడియోలజిస్ట్"గా వైద్యవృత్తి

లో పేరు పొందారు .పరోపకార0 వారి వ్యక్తిత్వం లో 

ఒకగొప్ప ఆభరణం 

      వీరి రచనలు

దివ్యలోచనాలు:-సూర్యచంద్రులు పరాత్పరుని 

రెండుకన్నులు. సుమారు 100 పద్యాలు పైగా సూర్యుని

పై శతకం వ్రాయగా ,అమ్మగారి ఆదేశం తలదాల్చి చందమామ మకుటంతో   పద్యాలు వ్రాసారు. అన్నిపద్యాలు కొత్తవూహలతో సులభావగాహనగా

ఉంటాయి. శ్రీ బేతవోలు,గరికపాటి వంటి మహామహుల ప్రశంసలు పొందినరచ ఇది.

 త్రిశతి:- శివ,శారదా,,అలిమలుమంగ దైవతములను

          ఉద్దేశించిన 3 శతకాలు

మకుటం లేని మహారాజులు :-

                 పద్యంలో మకుటం లేకుండా శతకరీతిలో

   సాగిన చమత్కారపద్యాలు

 అద్దిర బన్న శతకం :- అద్దిరబన్న అను మకుటంతో

    చమత్కారంగా సాగేపద్యాల శతకం ఇది.

దశావతార బంధ}

ప్రబంధం[:-  బంధ కవిత్వం అందరు కవులకు అందే 

 ద్రాక్ష కాదు. దానికి ప్రత్యేకమైన .... అభినవేశం,సూక్ష్మబుద్ధి

 అవసరం.  మన డాక్టర్గారు "దశావతార బంధ ప్రబంధం"

 అనుపేరున  పుస్తకం ప్రచురించి తనసత్తా చాటుకున్నారు.

       మనరసజ్ఞ భారతి లో పా0డురంగ మహాత్మ్యంపై 

  వారి ధారావాహిక వ్యాఖ్యానం చదువుతూ నేవున్నాం

  వారి"పాత పద్య0---,కొత్తకోణం""వ్యాసాలు సాహిత్యం లో వారి విమర్శనా పటుత్వాన్ని తెలుపుతున్నాయి 

         బహుముఖ ప్రజ్నా శాలి ,సహృదయులు అయిన 

శ్రీ డి ఎస్ గణపతి గారిని గురించి నేను వ్రాసిన ఈనాలుగు మాటలు  కొండను అద్దంలో చూపించిన

ప్రయత్నం గా భావించ గలరని సభ్యుల్ని కోరుకుంటున్నాను

 

          గణపతి కవిగారు శతాయువై ఆంధ్ర సాహిత్యానికి

 అమూల్య ఆభరణాలను కైసేయాలని ఆశీర్వదిస్తున్నాను.!!( బులుసు)


దిగుమతి కొరకు నొక్కండి👇

         తారాతోరణం - కవితా సంపుటి  డా. దేవగుప్తాపు సూర్యగణపతి రావు 👈పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

1 వ్యాఖ్యలు:

Buy Lead Generation said...

Buy Facebook Accounts

Post a Comment

అనుసరించువారు