కవిత్రయ విరచితమైన శ్రీమదాంధ్ర మహా భారతాన్ని తెలుగువారెప్పుడూ అభిమానంతో ఆదరిస్తుంటారు. చదువుతూ ఉంటారు. అది సర్వ లక్షణ సంగ్రహమంటారు నన్నయగారు. ఆ భారతం ఎంత మథించినా తరగని విజ్ఞాననవనీతాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మీకు ఎక్కడ చదవబుద్ధి పుడితే అక్కడే చదివెయ్యండి. ఈ క్రింద వరుసగా వాటి దిగుమతి లంకెలిస్తున్నాను. ఒక చిన్న విజ్ఞాపన. మీకు, మేము చేస్తున్న ఈ సేవ నచ్చితే, మీ సాంఘిక సంపర్క జాలాల్లో ప్రస్తావించి మరింత ఎక్కువజనాలకు సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఏ పుస్తకం నచ్చినా వెంటనే ఆ పుస్తకాన్ని ఇక్కడ దొరుకుతుందని పదుగురికి చెప్పండి. మన తెలుగుజాతికి చేసే సేవలో మీ వంతు చేయూత అందించండి.
తిరుమల తిరుపతి దేవస్థానంవారి అర్థతాత్పర్యాలతో కూడిన పుస్తకం కింది లంకెలో ఉంది.