భారతీ దేవిగారు వ్రాసిన నవల డాక్టరమ్మ. నవరత్న పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ రోజుల్లో నవలలు, కథలు చదవడం తగ్గింది కానీ, ఇది ప్రచురించబడిన 1980 ప్రాంతంలో ప్రజలు విపరీతంగా చదివే వారు. ఆ రోజుల్లో ఇంతగా టీవీలు కాని, ఇంటర్‌నెట్ కానీ లేకుండేవి. ఏది ఏమైనా కొత్త కొత్త టేక్నాలజి మనకు మేలుతో పాటు కొంత అనర్థాన్ని కూడా తెచ్చింది. అందులో పుస్తకపఠనం తగ్గడం. దాని వల్ల మనలో సృజనాత్మక లోపిస్తుంది అనేది మనం తెలుసుకుని, ప్రవర్తిస్తే మనం అదృష్టవంతులం.
కీర్తి అనేది తెల్లగా ఉంటుంది, అప కీర్తి నల్లగా ఉంటుంది మొదలైన భావనలను కవిసమయాలు అంటారు. కవులు వర్ణనలు చేయడానికి కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. వాటిని కవిసమయాలు అంటారు. ఆ విషయంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన వారు ఇరివెంటి కృష్ణ మూర్తి గారు. వారి సిద్ధాంతగ్రంథమే ప్రస్తుత గ్రంథం. ఇది చదివి తీరాల్సిన గ్రంథం. చదివాక మీరే అంటారు " అబ్బో! చదువకుండా ఉంటే ఎంత నష్టపోయేవాళ్ళం" అని.
కట్టమంచి రామ లింగా రెడ్డి Kattamanchi Rama Linga Reddy
తెలుగులో వెలువడిన మొట్టమొదటి ఆధునిక సాహిత్యవిమర్శ కట్టమంచి రామ లింగా రెడ్డి గారు వ్రాసిన కవిత్వ తత్వ విచారము. పింగళి సూరన వ్రాసిన కళాపూర్ణోదయం అనే ప్రబంధాన్ని లక్ష్యంగా స్వీకరించి వ్రాసారు.
మమ్మటుడు సంస్కృతంలో వ్రాసిన కావ్యప్రకాశః అనే లక్షణ గ్రంథం ధ్వనిప్రస్థానానికి సంబంధించినది. అది నేటికీ పరమ ప్రామాణికమైన గ్రంథం. అది సాహిత్యాధ్యేతలందరికీ అవసరమైనది.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి Janthyala Subrahmanya Shastri
Jandhyala Subrahmanya Shastri
పంచ సహస్రావధాని బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన కావ్యం సాలంకార కృష్ణ దేవరాయలు. ఇందులో పద్యాలన్నీ ఏదో ఒక అలంకారానికి లక్ష్యాలుగా ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారముందో గ్రంథాంతంలో పట్టికగా ఇచ్చారు. అలంకారాల లక్ష్యాలకొరకు వెతికే ఉపాధ్యాయులకు,విద్యార్థులకు,సాహితీ పిపాసకులకు, చరిత్రాధ్యేతలకు ..... తెలుగువారందరికీ ఉపయోగపడే కావ్యం.