తెలుగు భాషా సాహిత్యాలపై అభిమానమున్న ఎందరో మిత్రులు తమ వెబ్ సైట్స్ లో వివిధ శతకాలను అందిస్తూనే ఉన్నారు. వారందరూ అభినందనీయులే. అలాగే, మా దృష్టికి వచ్చిన శతకాల లంకెలను ఇక్కడ ఒక్కదగ్గర సంగ్రహింతామనిపించింది. ఇక్కడ మాకు కొత్తవి లంకెలు లభించినప్పుడల్లా చేరుస్తూనే ఉంటాము. మీరుకూడా లంకెలను సూచించవచ్చు.
సంస్కృతంలో శ్రీహర్షనైషధం నారికేళపాకం. నైషధం చదివిన సంస్కృత విద్యార్థి ఇంకే కావ్యం చదువకున్నా ఫర్వాలేదు. కొమ్ములు తిరిగిన పండితులకే టానిక్ అట ఈ కావ్యం.“నైషధం విద్వదౌషధమ్" అని ఆర్యోక్తి. అటువంటి నైషధ కావ్యం వ్యాఖ్యానం లెకుండా ఎలా అర్థమౌతుంది? మరి మన తెలుగువారికి తెలుగు లో వ్యాఖ్యానంతో అందించాలని సంకల్పించారు అప్పట్లో ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ వారు. లభించినంతవరకు అందించే ప్రయత్నం చేస్తాం.
వైదిక గ్రంథాలు తెలుగు లిపి లో లభించడం చాలా అరుదు. అటువంటి అపురూపమైన సాహిత్యం ఆసక్తి కలిగినవారి ఉపయోగార్థం తెలుగు పరిశోధన అందేట్టుగా చేస్తుంది. వీటిని అందించిన బ్రహ్మశ్రీ వి. రామలింగేశ్వర సుబ్రహ్మణ్య శర్మగారికి నమోవాకములు.
చివుకుల అప్పయ్య శాస్త్రి chivukula Appayya Saastri
షడ్దర్శనములు మన ప్రాచీనభారతీయ విజ్ఞాన వికాసానికి బాటలు వేసిన ఋషి ప్రోక్తాలైన గ్రంథాలు. చివుకుల అప్పయ్య శాస్త్రి గారు వ్రాసిన ఈ గ్రంథంలో భారతీయ షడ్దర్శనాల పరిచయం ఉంది.
సంస్కృతంలో కాళిదసు అశ్వధాటి వృత్తంలో దేవీ స్తోత్రాన్ని రచించాడు.అశ్వధాటి అంటే గుఱ్ఱం నడక. అంటే ఆ వృత్తంలో లోని రచన గుఱ్ఱ్ం నడకలా ఉంటుందన్నమాట. అది చిన్న స్తోత్రమే అయినా దాని కవితా సౌందర్యం సాహితీపిపాసకులను ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది.
సంస్కృతంలో పాణిని మహర్షి అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశాడు. అటువంటి అద్భుత శాస్త్రీయ గ్రంథం మరొకటి లేదంటారు విజ్ఞులు. అందులో సంస్కృత ధాతు పాఠము ఉంది. పది ప్రకరణాల ఆ ధాతువులను సంగ్రహించారు దయానందులు.
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.