గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి
డా.యన్.గోపి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం కొరకు సమ్ర్పించిన సిద్ధాంత గ్రంథం. ఎన్నో ఏళ్ళుగా విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంప్రదింపుగ్రంథంగా ఉన్న విశిష్ట రచన.
విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు రచించిన ఈ మహర్షుల చరిత్రలు అనే గ్రంథాన్ని తి.తి.దే. వారు ఏడు భాగాలుగా ప్రచురించారు. వాటిని అన్నింటిని ఒక్కదగ్గర చేర్చి సాయి భక్తులు మనకు అందిస్తున్నారు.
సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథాలను అంతర్జాలంలో లభించిన వాటినన్నింటిని ఒక్కచోట చేర్చి అందించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ సన్నిధానం వారి రచనలు. ప్రస్తుతం లభిస్తున్నవాటిని ప్రకటిస్తున్నాం. ఇంకా ఏవైనా పుస్తకాల లంకెలను ఎవరైనా అందిస్తే వాటినీ అందిస్తాం.
మచ్చ హరిదాసు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమే తెలుగులో యాత్రా చరిత్రలు. ఇందులో తెలుగులో వెలువడిన యాత్రా చరిత్రలు చక్కగా సేకరించి,వివరించారు. మంచి సమాచారం ఉంది.