దాశరథి రంగాచార్యుల రచనలను అంతర్జాలంలో లభించిన వాటిని ఒక్కదగ్గర చేర్చి, మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఆయా పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.
చర్ల గణపతి శాస్త్రిగారి రచనలన్నింటినీ ఒకే దగ్గర మనకోసం సమకూర్చి పెట్టారు చర్ల మృదుల గారు వారి ప్రత్యేకమైన charla.in అనే వెబ్ సైట్ ద్వారా. దాదాపు తొంబదికి పైగా ఉన్నవారి గ్రంథాలను దిగుమతి చేసుకుని తరించండి.
డాక్టర్ మలయశ్రీ గారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందేందుకు వ్రాసిన సిద్ధాంత వ్యాస గ్రంథం. ఇది వెయ్యేళ్ళ జిల్లా సాహిత్య చరిత్ర. ఇందులో ఎందరో కవులగురించి శోధించి వెలికి తెచ్చారు.
గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి