దశరథరాజ నందన చరిత్ర
Dasharatharaaja nandana charitra
(నిరోష్ఠ్య రామాయణ కావ్యం)
మరింగంటి సింగరాచార్య Maringanti Singara acharya
ఓష్ఠ్యములు అనేది వ్యాకరణ పారిభాషికపదం. ఓష్ఠములు అంటే పెదవులు. ఓష్ఠముల సహాయంయంతో ఉచ్చరించే అక్షరాలను ఓష్ఠ్యములు అంటారు. అవి - ప,ఫ,బ,భ,మ అనేవి. ఆ అక్షరాలు లేకుండా వ్రాయడాన్ని "నిరోష్ఠ్యంగా" వ్రాయడం అంటారు. రాసేదేమో రామాయణం. "రామ" అనే మాటలోనే ‘మ’ అనే ఓష్ఠ్యం ఉంది కదా? మరి రామాయణమంతా నిరోష్ఠ్యంగా రాయడమెలా? అందుకే కావ్యం పేరు కూడా ‘దశరథరాజ నందన చరిత్ర’ అని నిరోష్ఠ్యంగా పెట్టారు.