`తెలుగుపరిశోధన'ను అలమేలుమంగా సమేతుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించదలచారు. అందుకే తనకు ఇష్టమైన అన్నమయ్యకీర్తనలనే తేనెల గంగాప్రవాహాన్ని దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారనే భగీరథుని వెంట ఇక్కడినుండి ప్రవహింపజేయ సంకల్పించారు.
"తెలుగును తెలియాలంటే అన్నమయ్యను చదివి తీరాల్సిందే" అన్న రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి పలుకులను ఈ సందర్భంగా మనం గుర్తుతెచ్చుకోవాలి. ఒక రెండు నిమిషాలపాటు అన్యదేశ్యాలు లేని తెలుగు మాట్లాడడం ఎంతో కష్టమైన ఈ రోజుల్లో, పనిగట్టుకొని దేశభాషాసంస్కృతులను రూపుమాపే ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఒక్కసారి తేనెలూరే తేటతెనుగును మనం అర్థం చేసుకునేందుకు సహకరిస్తున్న డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారికి కృతజ్ఞతాభివందనాలు.
డాక్టరుగారు వృత్తిరీత్యా రేడియాలజిష్టు. ప్రవృత్తిరీత్యా వ్యాఖ్యాత. వారి దృష్టి సామాన్యుల దృష్టికంటే భిన్నమైనదనేది గతంలో 'పాండురంగమాహాత్మ్యం'కు వారి రసజ్ఞవ్యాఖ్య నిరూపించింది. ఇప్పుడు అన్నమయ్య పలుకుబళ్ళను మనకు పరిచయంచేస్తున్నారు. వారి వ్యాఖ్య లేకుంటే పాండురంగవిభుని పదగుంభనంకాని, ఈ 'తేనెపలుకుల అన్నమయ్య' వ్యాఖ్య లేకుంటే, తెలుగుభాషను మరిచే ప్రయత్నం చేస్తున్న మనకు, అన్నమయ్య అచ్చమైన తెలుగుకాని, జాతీయాలు కాని అర్థంకావడం కష్టమేనేమో!
అలనాడు వేంకటేశ్వర స్వామి జగన్మోహినిగా దేవతలకు సముద్రాన్ని చిలుకగా వెలువడిన అమృతం పంచిపెడితే, నేడు సూర్యగణపతులవారు అన్నమయ్య కీర్తనా సముద్రాన్ని చిలుకగా వచ్చిన తెలుగుభాషామృతాన్ని తెలుగుభాషాభిమానులకు అందిస్తున్నారు.
మీరిక్కడే చదువదలిస్తే ........
తేనె పలుకుల అన్నమయ్య by Dr.Pandu Ranga Sharma Ramaka on Scribd
మీరెక్కడైనా, ఎప్పుడైనా చదువుకుందామని పుస్తకాన్ని పొందగోరితే ........
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
1 వ్యాఖ్యలు:
Post a Comment