
ఈ కింది తెలుగు పద్యం చూడండి.
వేదముల్ సంస్కృత వాదముల్ చేసిన తెలుఁగువాఁడే చేయవలయు ననఁగసంస్కృతచ్ఛందస్సు చక్కఁగా సాగింప తెలుఁగులోనే సాగవలయు ననఁగఋతువులవద్దతి ఋజువుగా నుండఁగా నొకతెల్గునాటనే యుండు ననఁగనిఖిలసస్యములు పండింపఁగా దగినట్టి ధాత్రిలక్షణ మిందె తనరు ననఁగసర్వవేదాంతములకును జన్మభూమితూచిమనుజుఁడు తాల్చు దుస్తులకుఁ దగినదనుప్రమాణమ్ము చూపించి నట్టి నేలతెలుఁగుధాత్రికి ధాత్రిలో దీటుఁగలదె?ఈ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారిది. వివిధ కవులు వివిధ సందర్భాలలో తెలుగు జాతి, భాష, సంస్కృతులకు సంబంధించిన వ్రాసిన ఇటువంటి కవితలను సేకరించి ఆంధ్ర ప్రశస్తి...