17 July, 2025

Widgets

ఆంధ్ర ప్రశస్తి (వివిధ కవుల కవితా సంకలనం) Andhra Prashasti (Collections of Telugu Poetry of various poets)





ఈ కింది తెలుగు పద్యం చూడండి.
 
వేదముల్ సంస్కృత వాదముల్ చేసిన  తెలుఁగువాఁడే చేయవలయు ననఁగ
సంస్కృతచ్ఛందస్సు చక్కఁగా సాగింప తెలుఁగులోనే సాగవలయు ననఁగ
ఋతువులవద్దతి ఋజువుగా నుండఁగా నొకతెల్గునాటనే యుండు ననఁగ
నిఖిలసస్యములు పండింపఁగా దగినట్టి ధాత్రిలక్షణ మిందె తనరు ననఁగ

సర్వవేదాంతములకును జన్మభూమి
తూచిమనుజుఁడు తాల్చు దుస్తులకుఁ దగిన
దనుప్రమాణమ్ము చూపించి నట్టి నేల
తెలుఁగుధాత్రికి ధాత్రిలో దీటుఁగలదె?

ఈ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారిది. 
వివిధ కవులు వివిధ సందర్భాలలో తెలుగు జాతి, భాష, సంస్కృతులకు సంబంధించిన  వ్రాసిన ఇటువంటి కవితలను సేకరించి ఆంధ్ర ప్రశస్తి పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించారు తెలుగు విశ్వవిద్యాలయం వారు. 
 
 ఆ అపురూపమైన పుస్తకం మీ కోసం......

👉  ఆంధ్ర ప్రశస్తి Andhra Prashasti 👈 


పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు