Showing posts with label Annamayya. Show all posts
Showing posts with label Annamayya. Show all posts

21 November, 2019

తేనెపలుకుల అన్నమయ్య - డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు TenePalukula Annamayya - Dr.Devaguptapu SuryaGanapathi Rao

తేనెపలుకుల అన్నమయ్య - డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు TenePalukula Annamayya - Dr.Devaguptapu SuryaGanapathi Rao





  `తెలుగుపరిశోధన'ను అలమేలుమంగా సమేతుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించదలచారు. అందుకే తనకు ఇష్టమైన అన్నమయ్యకీర్తనలనే తేనెల గంగాప్రవాహాన్ని దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారనే భగీరథుని వెంట ఇక్కడినుండి ప్రవహింపజేయ సంకల్పించారు.

"తెలుగును తెలియాలంటే అన్నమయ్యను చదివి తీరాల్సిందే" అన్న రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి పలుకులను ఈ సందర్భంగా మనం గుర్తుతెచ్చుకోవాలి.  ఒక రెండు నిమిషాలపాటు అన్యదేశ్యాలు లేని తెలుగు మాట్లాడడం ఎంతో కష్టమైన ఈ రోజుల్లో, పనిగట్టుకొని  దేశభాషాసంస్కృతులను రూపుమాపే ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఒక్కసారి తేనెలూరే తేటతెనుగును మనం అర్థం చేసుకునేందుకు సహకరిస్తున్న డా.దేవగుప్తాపు సూర్యగణపతి రావు గారికి కృతజ్ఞతాభివందనాలు.

డాక్టరుగారు వృత్తిరీత్యా రేడియాలజిష్టు. ప్రవృత్తిరీత్యా వ్యాఖ్యాత. వారి దృష్టి సామాన్యుల దృష్టికంటే భిన్నమైనదనేది గతంలో 'పాండురంగమాహాత్మ్యం'కు వారి రసజ్ఞవ్యాఖ్య నిరూపించింది. ఇప్పుడు అన్నమయ్య పలుకుబళ్ళను మనకు పరిచయంచేస్తున్నారు. వారి వ్యాఖ్య లేకుంటే పాండురంగవిభుని పదగుంభనంకాని, ఈ 'తేనెపలుకుల అన్నమయ్య'  వ్యాఖ్య లేకుంటే, తెలుగుభాషను మరిచే ప్రయత్నం చేస్తున్న మనకు, అన్నమయ్య అచ్చమైన తెలుగుకాని, జాతీయాలు కాని అర్థంకావడం కష్టమేనేమో! 

అలనాడు వేంకటేశ్వర స్వామి జగన్మోహినిగా దేవతలకు సముద్రాన్ని చిలుకగా వెలువడిన అమృతం పంచిపెడితే, నేడు సూర్యగణపతులవారు అన్నమయ్య కీర్తనా సముద్రాన్ని చిలుకగా వచ్చిన తెలుగుభాషామృతాన్ని తెలుగుభాషాభిమానులకు అందిస్తున్నారు.

మీరిక్కడే చదువదలిస్తే ........




మీరెక్కడైనా, ఎప్పుడైనా చదువుకుందామని పుస్తకాన్ని పొందగోరితే ........


పై నొక్కండి.


ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

11 March, 2014

అన్నమయ్య శృంగార సంకీర్తనల్లో స్త్రీ ధర్మాలు

అన్నమయ్య శృంగార సంకీర్తనల్లో స్త్రీ ధర్మాలు

The Moral values of women in Musical compositions of Annamayya
పొన్నా లీలావతమ్మ Ponna Lilavathamma


పొన్నా లీలావతమ్మ గారు రచించిన అన్నమయ్య శృంగార సంకీర్తనల్లో స్త్రీ ధర్మాలు
గ్రంధాన్ని ఇక్కడ పొందండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

07 March, 2013

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు Folk Element in the musical Compositions Of Annamayya

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు
Folk Element in the musical Compositions Of Annamayya








పొన్నా లీలావతిగారు Ph.D. పట్టం కొరకు శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసం.







మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు
Folk Element in the musical Compositions Of Annamayya


........పై నొక్కండి

అనుసరించువారు