ఇటీవల నవీకరించిన టపాలు
Showing posts with label Telangana. Show all posts
Showing posts with label Telangana. Show all posts
12 April, 2020
09 April, 2020
07 April, 2020
తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి Telangana Telugu Sahitya Charitra - Mudiganti Sujata Reddy
తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతా రెడ్డి Telangana Telugu Sahitya Charitra - Mudiganti Sujata Reddy
తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ అస్తిత్వ భావనతో తమ భాషా, సాహిత్య, సాంస్కృతిక,చరిత్రలపైన ఇక్కడి పండితులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. అందులో భాగంగా తెలంగాణ సాహిత్య చరిత్రను విద్యార్థులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దారు ముదిగంటి సుజాతా రెడ్డిగారు.
19 January, 2016
సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu
సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. మంచిపండితుడు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రికసంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.
17 January, 2016
గోల్కొండ కవుల సంచిక Golkonda Kavula Sanchika
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.
లేబుళ్లు:
Telangana
Subscribe to:
Posts (Atom)