సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. మంచిపండితుడు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రికసంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.
ఆయన రచనలని తెలుగువారికి అందించే ప్రయత్నమే ఇది.
Browse » Home »
Suravaram
,
Telangana
» సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu
సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
తెలుగువారికి చూపునిచ్చిన మహానుభావుల్లో సురవరం ప్రతాపరెడ్డిగారొకరు. వారి స్వాతంత్ర్య మహత్వాకాంక్ష అసదృశం. 'ప్రజాధికారములు' 'ప్రాథమిక స్వత్వములు' అనే రెండు పుస్తకాలు చూడండి. మానవుడి ప్రాథమిక హక్కుల కోసం వారెంత పోరాడిందీ 'ప్రాథమిక స్వత్వములు' తెలియజేస్తుంది. వారి చారిత్రక దృష్టి గురించి ఇవాళ మనం ప్రత్యేకించి చెప్పుకోదగ్గ పని లేదు. ఈ పుస్తకాలు రెండూ 1939నాటి 'భారత ప్రభుత్వ చట్టం' వచ్చిన కాలంలో రాసినవి కాబట్టి వీటికి యెంతో చారిత్రక ప్రాధాన్యత వుంది. ఇవన్నీ నడుస్తున్న చరిత్రగా వున్నప్పటి కాలానికే వెళ్ళి మనం చదువుకోవచ్చు. తెలుగులో చరిత్రను ఆధునికత వైపు మళ్ళించడంలో సురవరం ప్రతాపరెడ్డిగారి కంట్రిబ్యూషన్ చాలా వుందని వారి వ్యాసాలు చూస్తే తెలుస్తుంది. నిజాం సర్కారుతో పోరాడుతున్నా ముస్లిములపట్ల అత్యంత సోదరభావంతో మెలిగారనీ, ఇస్లాం పట్ల వారికి గౌరవభావం మెండుగా వుండేదనీ వారి 'హజరత్ ఉమర్' వ్యాసం చూస్తే అర్థమవుతుంది. హజరత్ ఉమర్ గురించి మాట్లాడేటప్పుడు పొరపాటు దొర్లకుండా ముస్లిమైన ప్రతివాడూ జాగరూకత వహిస్తాడు. అలాంటిది హజరత్ ఉమర్ గురించి అక్షరం పొల్లు పోకుండా రాయగలిగారంటే వారి అవగాహనా సామర్థ్యం ఎంత లోతైనదో అర్థం చేసుకోవచ్చు.
హాస్యచతురత, వ్యంగ్యమర్యాదల్లో సురవరంవారు ఎవరికీ తీసిపోరు సుమా! కొండా వెంకట రంగారెడ్డిగారిమీద వారి వ్యాసం చూడండి.
Post a Comment