10 June, 2013

మహాభారతము - ద్రౌపదిMahabharathamu- Draupadi

మహాభారతము - ద్రౌపది
Mahabharathamu- Draupadi
డా.వాడవల్లి చక్రపాణిరావుVadavalli Chakrapani Rao


వాడవల్లి చక్రపాణిరావు గారు ఈ సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి,ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందారు. ఈ సిద్ధాంతవ్యాసం అందరికీ ఆసక్తికరం. కాగా పరిశోధక విద్యార్థులు ఈ సిద్ధాంత వ్యాసాన్ని తప్పకుండా ఒక్కసారి చూడాలి. పరిశోధనావ్యాస ప్రణాలిక ఎంత పకడ్బందీగా ఉండాల్లో తెలుస్తుంది. అంతెందుకు ? 26,27 పుటల్లో విషయ సూచిక ఉంది.మీరే చూడండి....

08 June, 2013

పారిజాతాపహరణము Parijata Apaharanamu

పారిజాతాపహరణము Parijata Apaharanamu
నంది తిమ్మన Nandi Timmana



ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని నంది తిమ్మన కవిత్వానికి పేరు. ఆయన వ్రాసిన పారిజాతాపహరణము అన్ని విధాలైన ప్రబంధ లక్షణాలను కలబోసుకున్నది. సత్యభామ వామ పాదంతో శ్రీకృష్ణుని తన్నినట్లు వ్రాసి, తెలుగు వారిలో ప్రచారంలోకి తెచ్చిన కవి.
"......అచ్చో వామపాదంబునన్ తొలగంద్రోచె లతాంగి, అట్లయగు, నాథుల్ నేరముల్ సేయ పేరలుకం జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే" అంటూ.

07 June, 2013

అమరకోశము Amara Kosha

అమరకోశము  Amara Kosha
అమరసింహ కవి Amara Simha


మీకు ఇంతవరకు మీ అభిమాన పుస్తకములందించే ఈ తెలుగు పరిశోధన వెబ్‌సైట్ మీకు ఎన్నో తెలుగు నిఘంటువుల (Telugu Dictionary)ను, సంస్కృత నిఘంటువుల(Sanskrit Dictionary)ను, ఇంగ్లీష్ తెలుగు నిఘంటువుల(English-Telugu Dictionary / Telugu English Dictionary)ను, హిందీ తెలుగు నిఘంటువు (Hindi -Telugu Dictionary) లను అందించింది. ఇక అమరకోశము అందించాలని సంకల్పించింది తెలుగు పరిశోధన.

06 June, 2013

ఇనుప కచ్చడాలు Inupa Kachchadalu

ఇనుప కచ్చడాలు Inupa Kachchadalu
తాపీ ధర్మా రావు Tapee Dharma Ravu
Taapi Dharma Rao

ఇంతకు ముందు తాపీ ధర్మారావు గారి పుస్తకం  పెళ్ళీ - దాని పుట్టుపూర్వోత్తరాలు  అందించాం. ఇప్పుడు ఈ పుస్తకాన్ని అందిస్తున్నాము. తాపీ ధర్మారావుగారి పరిశోధనా పటిమ, విషయ ప్రతిపాదన, సిద్ధాంతాలు ఎంత గొప్పవో చదివితే మీకే తెలుస్తుంది.

05 June, 2013

పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు Pelli - Daani Puttu Poorvottaraalu

పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు
 Pelli - Daani Puttu Poorvottaraalu
తాపీ ధర్మారావు Tapi - Dharma Ravu
                                                                Taapi Dharma Rao




pelli -Dani puttu purvottaralu -





To Down load click on.....
పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు 

04 June, 2013

తెలుగులో దేశీచ్ఛందస్సు Indigenous Meters in Telugu

తెలుగులో దేశీచ్ఛందస్సు 
                Indigenous Meters in Telugu
            డా.సంగనభట్ల నర్సయ్య   Dr.Sanganabhatla Narsayya



నన్నయ భారతాన్ని అనువదించడం ఆరంభించేకంటే ముందునుండే తెలుగులో దేశీ ఛందస్సు ఉంది. ఆనాటి నుండి ఆరంభమైన ఆ ఛందస్సు ఆ తర్వాత ఏ విధంగా వికాసం చెందిందీ ఈ సిద్ధాంతవ్యాసంలో సంగనభట్ల నర్సయ్యగారు నిరూపించారు.

02 June, 2013

తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం Influence of Sanskrit& Prakrit Grammars on Telugu Grammars

తెలుగు వ్యాకరణాలపై 
సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం
Influence of Sanskrit& Prakrit Grammars on Telugu Grammars 
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం Betavolu Rama Brahmam
Betavolu Ramabrahmam


తెలుగు ద్రావిడ భాష ఐనప్పటికీ తెలుగుసాహిత్యంపై సంస్కృత ప్రభావం ఎంతటిదో అందరికీ తెలుసు. అసలు తెలుగులో గ్రంథ రచన ప్రారంభమైందే సంస్కృత వ్యాసభారత అనువాదంతో. ఇక వ్యాకరణ విషయానికి వస్తే మన వ్యాకర్తలు ఉపయోగించినది సంస్కృత వ్యాకర్తల ప్రణాలికలే, వారి పారిభాషిక పదాలే. ఇంకా ఏమేమున్నాయో పరిశోధించి అందజేసారు బేతవోలు రామబ్రహ్మం గారు తమ నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించిన Ph.D. సిద్ధాంతవ్యాసగ్రంథంలో. ఆ విశిష్ట గ్రంథమే ఇది.

01 June, 2013

ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము Praudha Vyakarana Ghanta patham

ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము
 Praudha Vyakarana Ghanta patham
వంతరాం రామ కృష్ణా రావు  Vantaraam Rama Krishna Rao 





ముక్త లక్షణ కౌముదీ కారులైన వంతరాం వారు ఘంటాపథమను పేర వ్యాఖ్యానం వ్రాసారు. ఆ విశిష్ట గ్రంథమే ఇది.
ఈ పుస్తకం వ్యాకరణాధ్యేతలకు ఉపయోగకరం.

అనుసరించువారు