ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తెలుగుభాషగురించి, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం గురించి...... అన్ని విషయాలను వారు పాఠం చెప్పిన అనుభవంతో వ్రాసిన గ్రంథ రత్నమిది.
ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు తెలుగులో వెలువడిన పరిశోధనలపై గతంలో ఒక సమీక్షావ్యాసాల సంకలనం ప్రచురించింది. ఈ గ్రంథరాజం పరిశోధక విద్యార్థులకు, ఆచార్యులకు, తెలుగులో జరిగిన పరిశోధనలగూర్చి తెలిసికోదలచిన జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగకరం.