04 December, 2014

నన్నెచోడుని కవిత్వము Nannechoduni Kavitvamu

నన్నెచోడుని కవిత్వము
 Nannechoduni Kavitvamu
అమరేశం రాజేశ్వర శర్మ  amaresham Rajesvara Sharma

(వికీ పీడియా నుండి)
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.

03 December, 2014

నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం) Nannechoduni Kumara sambhavam

నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం) 
Nannechoduni Kumara sambhavam

నన్నెచోడుడు అత్యంత ప్రాచీనుడైన కవి. ఈయన నన్నయకు పూర్వుడనీ వాదించిన పండితులున్నారు. ఆ వివాదాలను పక్కకు పెడితే, నన్నెచోడుని కవిత్వం చదివి రసానుభవంపొందాలి. దాని వ్యాఖ్యానం లేకుంటే అది కొంత కష్టం. జాను తెనుగు దానికి కారణం. తెలుగునే చదువులో మరుస్తున్న ఈ రోజుల్లో వ్యాఖ్యానసహితమైన ఈ పుస్తకం అపురూపమే కదూ?
వికీపీడియా నుండి-

నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడతమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివస్కాందవాయుబ్రహ్మాండ పురాణాల్లోనూ, భారతరామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.




Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి
ఇవి కూడా చూడండి:-  

                నన్నెచోడుని పదప్రయోగ సూచిక 

నన్నెచోడుని కవిత్వము 

02 December, 2014

నన్నయ భారతి Nannayya Bharathi 2

నన్నయ భారతి Nannayya Bharathi 2

వివిధ పత్రికల్లో నన్నయ మీద ప్రచురితమైన వ్యాసాలను సేకరించి, ఒక దగ్గర అందించాలనే సత్సంకల్పంతో తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన గ్రంథమే ఇది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, సాహిత్య రసికులు అందరూ ఆదరిస్తారని మా విశ్వాసం. నన్నయకు సంబంధిన వివిధ వ్యాసాలు ఒక్కదగ్గర లభించడం ఎంత అదృష్టం?

01 December, 2014

నన్నయ భారతి Nannayya Bharathi 1

నన్నయ భారతి Nannayya Bharathi 1

వివిధ పత్రికల్లో నన్నయ మీద ప్రచురితమైన వ్యాసాలను సేకరించి, ఒక దగ్గర అందించాలనే సత్సంకల్పంతో తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన గ్రంథమే ఇది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, సాహిత్య రసికులు అందరూ ఆదరిస్తారని మా విశ్వాసం. నన్నయకు సంబంధిన వివిధ వ్యాసాలు ఒక్కదగ్గర లభించడం ఎంత అదృష్టం?

13 November, 2014

భారతి మాస పత్రికలు Bharathi Magazines

భారతి మాస పత్రికలు

ఈ అపురూప గ్రంథాలను ఇక్కడ పొందండి.


Down Load Here...  దిగుమతి చేసుకోవాలంటే....


మునుముందు మరిన్ని సంచికలు సేకరించి పెట్టే ప్రయత్నం చేస్తాము. మీరు ఈ టపాను మీ సాంఘిక సంపర్క జాలాల్లో పంచుకోండి.

14 September, 2014

విద్యార్థి కల్పతరువు Vidyarthi Kalpataruvu (Updated on 4.1.2025)


ఆంధ్ర సాహిత్య సర్వస్వం పేరున ఉన్న ఈ నిఘంటువు విద్యార్థి కల్పతరువు కు సరియైన ప్రత్యామ్నాయం. దీన్ని దిగుమతి చేసుకొని, విద్యార్థి కల్పతరువు వలన పొందే లాభాన్ని పొందండి.

08 September, 2014

భారతంలో ప్రేమ కథలు Bharatham lo Prema kathalu

భారతంలో ప్రేమ కథలు Bharatham lo Prema kathalu
                                                 ముక్తేవి భారతీ లక్ష్మణ రావు

ముక్తేవి భారతీ లక్ష్మణ రావు గారలు వ్రాసిన వివిధమైన ప్రేమ కథలు ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. ఈ అపురూప గ్రంథాన్ని ఇక్కడ పొందండి.

07 September, 2014

భాష - ఆధునిక దృక్పథం Bhasha Adhunika Drikpatham

భాష - ఆధునిక దృక్పథం
 Bhasha Adhunika Drikpatham
డా. పోరంకి దక్షిణా మూర్తి Dr.Poranki Dakshina murthi

డా. పోరంకి దక్షిణా మూర్తి గారు వ్యావహారిక భాషా రచన గురించి వ్రాసిన వివిధ వ్యాసాలు ఈ పుస్తకంలో చదువుకోవచ్చు. ఈ అపురూప గ్రంథాన్ని ఇక్కడ పొందండి.


అనుసరించువారు