నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం)
Nannechoduni Kumara sambhavam
వికీపీడియా నుండి-
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివ, స్కాంద, వాయు, బ్రహ్మాండ పురాణాల్లోనూ, భారతరామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి