దశరూపక సారము Dasha Rupaka Saramu
గడియారం రామకృష్ణ శర్మ GadiyaaraM Rama krishna Sharma
మన దృశ్యకావ్యాలను రూపకాలు అంటారు. ఆ రూపకాలు పది రకాలు. అందులో ‘నాటకం’ అనే రూపకభేదం మొదటిది. ఆ మొదటి రూపకభేదమైన నాటకం పేరుతోనే మనం రూపకాలను వ్యవహరిస్తున్నాం.
మొట్టమొదటి రూపక లక్షణ గ్రంథం భరత ముని రచితమైన ‘నాట్య శాస్త్రం’ అనే గ్రంథం. భారతీయ అలంకార శాస్త్రంలో (అగ్నిపురాణం తర్వాత)వెలువడిన మొట్టమొదటి గ్రంథమది.