మీ కోసం ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న అడవి బాపిరాజు రచనలని ఒక్క చోట అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అందుబాటులో ఇంకేవైనా ఉంటే అందిస్తే పదిమందితో పంచుకుందాం.
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.
ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
ప్రఖ్యాత "కాంతం కథలు" రచయిత మునిమాణిక్యం నర్సింహా రావు గారి కథలు పదిగల కూర్చి, మీముందుకు తీసుకొస్తున్నాం. సునిశిత హాస్యానికి ఈ కథలు పెట్టిన పేరు. ఇదంతా ఎందుకు? చదివి ఆనందించండి........