ఈ రెండు భాగాల దివాకర్ల వేంకటావధానిగారి పరిశోధనాగ్రంథం ప్రాఙ్నన్నయ యుగం గురించి విపులంగా చర్చించడమే కాక భారతావతరణాన్నీ స్పృశిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు సమర్పించిన తొలితరం పరిశోధనాగ్రంథం. అపురూపమైన సంప్రదింపు గ్రంథం.
Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam
ప్రసిద్ధ వ్యాకరణశాస్త్ర పండితులు, భాషాశాస్త్రవేత్త, ఆచార్యులు అంబడిపూడి నాగభూషణంగారి వ్యాకరణ రచనలు లభిస్తున్నాయి. వాటిని చదవడంవల్ల మన భాషా జ్ఞానం పెరుగుతుంది. చక్కని సంప్రదింపు గ్రంథాలు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.
వాసుదాసుయై
యవతరించి శ్రీరామాయణమును తెనిగించి బండ్ల కెక్కించి లోకోద్ధరణ మొనరించి తమ
73 ఏట పరమవదించిరి. ఆయనే వాసుదాసు అన్వర్థ నామ ధేయుడై శ్రీ వావిలికొలను
సుబ్బారావు గారు – ఆంధ్రవాల్మీకిబిరుదాంకితులు – శ్రీ కోదండ రామ సేవక సమాజ
సమాజ సంస్థాపనాచార్యులు – ఆంధ్ర వాల్మీకి రామాయణ శ్రీ కృష్ణ లీలామృత ద్విపద
భగవత్ గీతాది బహుగ్రంధ కర్తలు ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు
భక్తి మత ప్రచారకులు – మహర్షి – మౌని – అకుంఠిత రామభక్తుడు – తత్త్వ వేత్త –
వక్త – విమర్శకులు.
వివిధ తెలుగు కవిపండితుల రచనలను మీ అభిమాన తెలుగుపరిశోధన అందిస్తున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. అందులో భాగంగా ప్రసిద్ధ శాస్త్రపండితులు, కథారచయిత అయిన వేలూరి శివరామ శాస్త్రిగారి కొన్ని రచనలను మీ ముందుకి తెస్తున్నాం.