భారతీ అంటే వేదభారతి. వేదానికి రక రకాలైన పేర్లున్నాయి. వేద సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సంప్రదాయానుసారంగా వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేదానికి ఉన్న ఆయా పేర్లను గూర్చిన విపులవిచారణ చేయడంద్వారా వేద సంప్రదాయాన్ని చక్కగా పరిచయంచేసారు హరిసోదరులు.
ఆసూరి మరింగంటి వేంకటనరసింహా ssచార్యుల రచనల సమగ్ర పరిశీలన అనే పరిశోధనా గ్రంథం మాడభూశిణి రంగాచర్యుల రచన. ఉస్మానియా విశ్వవిద్యాలయంనందు Ph.D పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం.
తెలుగు లో వెలువడిన స్త్రీల పత్రికలపై పరిశోధననే ఈ అస్పష్ట ప్రతిబింబాలు అనే గ్రంథం. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంనందు M.Phil పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం. అందుకోండి ఈ కానుక.
కేతవరపు రామకోటి శాస్త్రి - Kethavarapu Ramakoti Shasthri
తెలుగు వారు అవధానాలకు ఆరంభకులు. తెలుగులో అవధానాలు, చాటువులు ఇవి ఆశుకవిత్వానికి సంబంధించినవి. వీటిపై ప్రామాణికమైన రచన చేసి కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనకు అందించారు. అందుకోండి ఈ కానుక.