05 May, 2015

దర్శనదర్పణము Darshana Darpanamu

దర్శనదర్పణము Darshana Darpanamu
చివుకుల అప్పయ్య శాస్త్రి chivukula Appayya Saastri


షడ్దర్శనములు మన ప్రాచీనభారతీయ విజ్ఞాన వికాసానికి బాటలు వేసిన ఋషి ప్రోక్తాలైన గ్రంథాలు. చివుకుల అప్పయ్య శాస్త్రి గారు వ్రాసిన ఈ గ్రంథంలో భారతీయ షడ్దర్శనాల పరిచయం ఉంది.

04 May, 2015

దేవీ అశ్వధాటి Devi Ashva dhati

దేవీ అశ్వధాటి  Devi Ashva dhati
కాళిదాసు Kalidasu


సంస్కృతంలో కాళిదసు అశ్వధాటి వృత్తంలో దేవీ స్తోత్రాన్ని రచించాడు.అశ్వధాటి అంటే గుఱ్ఱం నడక. అంటే ఆ వృత్తంలో లోని రచన గుఱ్ఱ్ం నడకలా ఉంటుందన్నమాట. అది చిన్న స్తోత్రమే అయినా దాని కవితా సౌందర్యం సాహితీపిపాసకులను ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది.

03 May, 2015

ధాతుపాఠము Dhatu pathamu

ధాతుపాఠము Dhatu pathamu
పాణిని మహర్షి Panini maharshi


సంస్కృతంలో పాణిని మహర్షి అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశాడు. అటువంటి అద్భుత శాస్త్రీయ గ్రంథం మరొకటి లేదంటారు విజ్ఞులు. అందులో సంస్కృత ధాతు పాఠము ఉంది. పది ప్రకరణాల ఆ ధాతువులను సంగ్రహించారు దయానందులు.
ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.


చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

02 May, 2015

దశరూపక సారము Dasha Rupaka Saramu

దశరూపక సారము Dasha Rupaka Saramu
గడియారం రామకృష్ణ శర్మ GadiyaaraM Rama krishna Sharma


మన దృశ్యకావ్యాలను రూపకాలు అంటారు. ఆ రూపకాలు పది రకాలు. అందులో ‘నాటకం’ అనే రూపకభేదం మొదటిది. ఆ మొదటి రూపకభేదమైన నాటకం పేరుతోనే మనం రూపకాలను వ్యవహరిస్తున్నాం.
మొట్టమొదటి రూపక లక్షణ గ్రంథం భరత ముని రచితమైన ‘నాట్య శాస్త్రం’ అనే గ్రంథం. భారతీయ అలంకార శాస్త్రంలో (అగ్నిపురాణం తర్వాత)వెలువడిన మొట్టమొదటి గ్రంథమది.

01 May, 2015

భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు మాసపత్రికలు, ఉచిత వీడియోలు ఒకేచోట!!


http://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు మాసపత్రికలు, ఉచిత వీడియోలు ఒకేచోట!!



సాయినాధుని కృపవల్ల భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబందపు ఉచిత మాసపత్రికలను ఇంటర్నెట్ లో సేకరించి  ebook(PDF) రూపంలో అందించటం జరిగింది. ఈ రోజున  గురుదేవుల అనుగ్రహంతో ఉచిత మాసపత్రికలు విభాగం ప్రారంబించబడినది, అలాగే ఉచిత వీడియో ప్రవచనాలు, భక్తి సినిమాలు ఒకే చోట చేర్చటం జరిగింది. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని  ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో, లింక్  పొందటంలో ఏమైనా  ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. ఈ జ్ఞాన యజ్ఞానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎంతో ఋణపడిఉంటాము.

28 April, 2015

దశరథరాజ నందన చరిత్ర Dasharatharaaja nandana charitra (నిరోష్ఠ్య రామాయణ కావ్యం)


దశరథరాజ నందన చరిత్ర
 Dasharatharaaja nandana charitra
(నిరోష్ఠ్య రామాయణ కావ్యం)
మరింగంటి సింగరాచార్య Maringanti Singara acharya


ఓష్ఠ్యములు అనేది వ్యాకరణ పారిభాషికపదం. ఓష్ఠములు అంటే పెదవులు. ఓష్ఠముల సహాయంయంతో ఉచ్చరించే అక్షరాలను ఓష్ఠ్యములు అంటారు. అవి - ప,ఫ,బ,భ,మ అనేవి. ఆ అక్షరాలు లేకుండా వ్రాయడాన్ని "నిరోష్ఠ్యంగా" వ్రాయడం అంటారు. రాసేదేమో రామాయణం. "రామ" అనే మాటలోనే ‘మ’ అనే ఓష్ఠ్యం ఉంది కదా? మరి రామాయణమంతా నిరోష్ఠ్యంగా రాయడమెలా? అందుకే కావ్యం పేరు కూడా ‘దశరథరాజ నందన చరిత్ర’ అని నిరోష్ఠ్యంగా పెట్టారు.

27 April, 2015

మంచి కథ Manchi Katha (41 కథల సంకలనం)


మంచి కథ Manchi Katha
41 కథల సంకలనం

వివిధ రచయితలు వ్రాసిన 41 కథలను మంచికథ పేరుతో సంకలనం చేసి అందించారు. కథాపిపాసులకు ఇది నచ్చుతుంది.

26 April, 2015

మానవల్లి కవి రచనలు Manavalli Kavi Rachanalu


మానవల్లి కవి రచనలు Manavalli Kavi Rachanalu
మానవల్లి రామకృష్ణ కవి Manavalli Ramakrishna kavi

మానవల్లి రామకృష్ణ కవి గారి రచనలను ఇందులో ఒక్కదగ్గర చేర్చారు .ఈ పుస్తకం చదువదగిన పుస్తకం. మీకు నచ్చుతుందని మా నమ్మకం.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు