మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

తెలుగుపరిశోధనల పట్టిక Directory Of Dissertations On Telugu

తెలుగుపరిశోధనల పట్టిక 
Directory Of Dissertations On Telugu



తెలుగుపరిశోధన వెబ్ సైట్ అధ్వర్యంలో తెలుగుపరిశోధకుల వివరాలు పొందుపరచాలని సంకల్పించాము.

ఇటువంటిది సంస్కృతంలో ఎప్పటినుండో ఉంది. అది
DIRECTORY OF DOCTORAL DISSERTATIONS ON SANSKRIT OF INDIAN UNIVERSITIES వద్ద చూడవచ్చు.

అటువంటిది మన తెలుగుకు కూడా ఏర్పాటు చేస్తే అందరికీ అక్కరకు వస్తుందని ఆ ప్రయత్నానికి పూనుకున్నాము. దీనికి అందరి సహకారం అవసరం.
తెలుగుపరిశోధనల పట్టిక Directory Of Dissertations On Telugu
వద్ద దానిని మీరు చూడవచ్చు.(తెలుగు పరిశోధన సైట్‌లో పైన పేజ్ బార్ లో Directory అనే బొత్తం మీద నొక్కండి.)


తెలుగులో జరిగిన పరిశోధనల వివరాలను తెలుపుతూ మొదట ఆం.ప్ర.సాహిత్యపరిషత్ వారు గతంలో ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే పేరుతో పుస్తకం అచ్చు వేసారు. అది పరిశోధకులకు మార్గదర్శకంగా ఉండేది. కానీ అది ప్రస్తుతం కాపీలు చెల్లి పునర్ముద్రణ లేక లభించడం లేదు.

ఆ తర్వత డా.వెల్దండ నిత్యానంద రావు వ్యక్తిగతంగా పూనుకొని 1988 సం.లో మరియు 1998 సం.లో అప్పటివరకు వెలువడిన సమాచారాన్ని సేకరించి ప్రకటించారు.

ఈ మధ్యే సి.పి.బ్రౌన్ అకాడమీ వారు ‘తెలుగు పరిశోధనా వ్యాసమంజరి’ పేరుతో 2005-2007 మధ్యకాలంలో వెలువడిన పరిశోధనల సారసంగ్రహాలను 60 వరకు సంగ్రహించి ప్రకటించింది.అందులో కొంతవరకు పరిశొధనలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.దానికీ సంపాదకులు డా.వెల్దండ నిత్యానందరావుగారే.

ఆ పుస్తకాలు వెలువడినప్పుడు విద్యార్థిలోకానికి జరిగిన ఉపకారం అవి కొద్దికాలంలోనే చెల్లుబాటుకావడలోనే తెలుస్తుంది. ఆ పుస్తకాలను విద్యార్థులు, ఆచార్యులూ  కరదీపికలుగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగవల్సిందే.ఎప్పటికప్పుడు ఆ యా పరిశోధన విశేషాలను ఇంటర్ నెట్ లో పెట్టడం ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలనేది సంకల్పం. దీనికి కేవలం ఏ ఒక్కరో పూనుకొంటే అయ్యేది కాదు. విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులూ అందరూ మనస్ఫూర్తిగా సహకరించిననాడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి.


ఈ పుటను అవకాశాన్ని పట్టి వివరాలు పెంచుకుంటూనే పోతున్నాము. నిత్యానందరావుగారి పుస్తకం, సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి పుస్తకం, ఆం.ప్ర.సాహిత్య అకాడెమి వారి తెలుగులో పరిశోధన పుస్తకాల్లోని వివరాలను క్రమంగా అందిస్తున్నాము. వాటిలోకి ఎక్కని పరిశోధనల వివరాలు ఎన్నో ఉన్నాయి. తమ పరిశోధనల వివరాలు ఇక్కడ ప్రచురించాలని అనుకునేవారు ఈ కింది పట్టిక పద్ధతిలో వివరాలు పంపిస్తే ఇందులో ప్రకటిస్తాము.
వివరాలు పంపదలచుకునేవారు rpsharma@teluguthesis.com కు పంపించగలరు.

దయచేసి ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరితో పంచుకో గలరు.

2 వ్యాఖ్యలు:

nagaraju said...

Kindly regarding Srikalahasti temple thesis,and Durjati books,giri pradakshinam books.I am collected from all over india.Kindly inform me above books.

Venu Oruganti said...

పైన పేర్కొన్న Directory of Dissertations on Telugu లంకె పనిచెయ్యటం లేదు. దయచేసి సరి అయిన లంకె పొందుపరచగలరు.

Post a Comment

అనుసరించువారు