వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19 ఏప్రిల్, 2026

ఆంధ్ర మునిత్రయ తత్వదర్శనము - చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ Andhra Munitraya Tatva Darshanamu





సంస్కృత వ్యాకరణానికి పాణిని కాత్యాయన పతంజలులు ముని త్రయం. పాణిని సూత్రాలు వ్రాయగా, కాత్యానుడు కారికలు, పతంజలి మహాభాష్యాన్ని రచించారు. అదేవిధంగా తెలుగులో నన్నయ 'ఆంధ్ర శబ్ద చింతామణి' వ్రాయగా, అధర్వణ పండితుడు 'వికృతి వివేక' కారికలు, ఈ రెండు గ్రంథాలపై భాష్యంగా అహోబలపతి  'కవిశిరోభూషణము' రచించెను. ఈ నన్నయ, అధర్వణ, అహోబలపతులను సూత్ర వార్తిక భాష్యకారులను ముని త్రయంగా తెలుగు వ్యాకరణ పండితులు భావిస్తారు. 
అటువంటి ఆంధ్ర ముని త్రయంపై అవగాహన రాహిత్యంతో రకరకాలైన ఆరోపణలు చేస్తూ ప్రాచీన తెలుగు వ్యాకరణ సంప్రదాయానికి కొందరు భంగం వాటిల్ల చేశారు. వారందరి వాదనలను ఖండిస్తూ, సంప్రదాయ పద్ధతిని సిద్ధాంతీకరిస్తూ ప్రసిద్ధ పండితులు డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ గారు రెండు భాగాలలో తమ సిద్ధాంత వ్యాస గ్రంధాన్ని నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు.
ఆ గ్రంథము -తెలుగు వ్యాకరణ శాస్త్రంపట్ల శాస్త్రీయమైన అవగాహన కల్పిస్తుంది. వ్యాకరణ శాస్త్ర జిజ్ఞాసవులు తప్పనిసరిగా చదవదగిన గ్రంథం. 
దిగుమతి కొరకు గ్రంథ శీర్షికలపై నొక్కండి. 👇

పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి. ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

08 జులై, 2025

బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం - స్ఫూర్తిశ్రీ Bala Proudha Vyakarana Sarvaswam - SphoortiSree



స్ఫూర్తిశ్రీ భాస్కరరావు గారు వ్రాసిన బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం రెండు భాగాలు ఇక్కడ మీకు అందిస్తున్నాం 

 బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం 





  పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

08 ఏప్రిల్, 2021

ప్రౌఢ వ్యాకరణము - బహుజనవల్లి సీతారామాచార్యులు Praudha Vyakaranamu - Bahujanavalli Sitaramacharyulu

 






బహుజనవల్లి సీతారామాచార్యులుగారు వ్రాసిన ప్రౌఢవ్యాకరణం గూర్చి కొత్తగా తెలుపాసిన అవసరం లేదు. బాలవ్యాకరణమందు ప్రస్తావించబడని లేదా అభిప్రాయ భేదాలున్న విషయపూరకంగా వ్రాయబడినది ప్రౌఢవ్యాకరణం. 

06 ఏప్రిల్, 2020

మీరు ఈ తెలుగు పాఠాల వెబ్ సైట్ చూశారా? Have you ever visited the website for Telugu Lessons

మీరు ఈ తెలుగు పాఠాల వెబ్ సైట్ చూశారా? 
Have you ever visited the website for Telugu Lessons

తెలుగు విద్యాలయం


        మీ ఇంటిలో చదువుకుంటున్న పిల్లలు ఉండవచ్చు. లేదా డిగ్రీ చేస్తున్నవారైనా, పోటీ పరీక్షలకు వెళ్ళే వారైనా ఉండవచ్చు. ఇటువంటి వారికోసం..... తెలుగు పాఠాలు చేసి పెట్టాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన మొదలు పెట్టింది. దాని కొరకు www.academy.teluguthesis.com  అనే URL వద్ద 'తెలుగు విద్యాలయం' అనే వెబ్ సైట్ ప్రారంభించాను. నా (ఊహా-) శక్తి మేరకు వీడియో పాఠాలు చేసి, Sanskrit Central అనే యూట్యూబ్ ఛానెల్ లో పాఠాలు పెట్టి, వాటి లంకెలు ఈ వెబ్ సైట్ లో పెడుతున్నాను.ఈ సైట్ లో పైన్ ఉన్న ట్యాబ్స్ లో 'విద్యాలయం' అనే ట్యాబ్ పై నొక్కితే ఆ వెబ్సైట్ చేరుకుంటారు. 

     అందులో ఎనిమిదవ తరగతి నుండి మొదలుకొని పి.జి.విద్యార్థుల వరకు అక్కరకు వచ్చే తెలుగు వ్యాకరణం పాఠాలు చేర్చాను. ఇంకా చేర్చే ప్రయత్నంలో ఉన్నాను. అంతే కాకుండా, ఎనిమిదవ తరగతి నుండి పిజి చదివే విద్యార్థులకు ఉపయోగపడే తెలుగు, సంస్కృత పాఠాలు చేసే ప్రయత్నంలో ఉన్నాను.  అక్కడ నేను చేర్చిన సాహిత్య,అలంకార, ఛందో, వ్యాకరణాది విషయాల్లోని పాఠాలను వేనిని చేర్చానో ఈ కింది టపాలో వివరించాను. చూడండి.  ఇవన్నీ అందరికీ అక్కరకు వచ్చేవే. చూడండి.

    విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షార్థులు, తెలుగు భాషా సాహిత్యాభిమానులు మొదలైన వారందరూ ఒకసారి ఆ వెబ్ సైట్ చూసి, ఆ యూట్యూబ్ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. 

  అందరి ప్రోత్సాహముంటే, మరిన్ని పాఠాలు చేసే ఉత్సాహం, సామర్థ్యం నాకు వస్తుంది.   

దయచేసి సందర్శించండి. ....






ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

01 జూన్, 2013

ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము Praudha Vyakarana Ghanta patham

ప్రౌఢ వ్యాకరణ ఘంటాపథము
 Praudha Vyakarana Ghanta patham
వంతరాం రామ కృష్ణా రావు  Vantaraam Rama Krishna Rao 





ముక్త లక్షణ కౌముదీ కారులైన వంతరాం వారు ఘంటాపథమను పేర వ్యాఖ్యానం వ్రాసారు. ఆ విశిష్ట గ్రంథమే ఇది.
ఈ పుస్తకం వ్యాకరణాధ్యేతలకు ఉపయోగకరం.

అనుసరించువారు