సంస్కృత వ్యాకరణానికి పాణిని కాత్యాయన పతంజలులు ముని త్రయం. పాణిని సూత్రాలు వ్రాయగా, కాత్యానుడు కారికలు, పతంజలి మహాభాష్యాన్ని రచించారు. అదేవిధంగా తెలుగులో నన్నయ 'ఆంధ్ర శబ్ద చింతామణి' వ్రాయగా, అధర్వణ పండితుడు 'వికృతి వివేక' కారికలు, ఈ రెండు గ్రంథాలపై భాష్యంగా అహోబలపతి 'కవిశిరోభూషణము' రచించెను. ఈ నన్నయ, అధర్వణ, అహోబలపతులను సూత్ర వార్తిక భాష్యకారులను ముని త్రయంగా తెలుగు వ్యాకరణ పండితులు భావిస్తారు.
అటువంటి ఆంధ్ర ముని త్రయంపై అవగాహన రాహిత్యంతో రకరకాలైన ఆరోపణలు చేస్తూ ప్రాచీన తెలుగు వ్యాకరణ సంప్రదాయానికి కొందరు భంగం వాటిల్ల చేశారు. వారందరి వాదనలను ఖండిస్తూ, సంప్రదాయ పద్ధతిని సిద్ధాంతీకరిస్తూ ప్రసిద్ధ పండితులు డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ గారు రెండు భాగాలలో తమ సిద్ధాంత వ్యాస గ్రంధాన్ని నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు.
ఆ గ్రంథము -తెలుగు వ్యాకరణ శాస్త్రంపట్ల శాస్త్రీయమైన అవగాహన కల్పిస్తుంది. వ్యాకరణ శాస్త్ర జిజ్ఞాసవులు తప్పనిసరిగా చదవదగిన గ్రంథం.
దిగుమతి కొరకు గ్రంథ శీర్షికలపై నొక్కండి. 👇
