Showing posts with label Reference Book. Show all posts
Showing posts with label Reference Book. Show all posts

14 June, 2025

పూర్వ గాథా లహరి Poorva Gadha Lahari

 


పూర్వగాథాలహరి నందు ఎన్నో పురణాలు,చరిత్రలు, ఉపనిషత్తులు పాత్రల వ్యైశిష్ఠ్యాన్ని తెలియజేశారు. ఇందులో అకారాదిగా పురాణ పాత్రల సంక్షిప్త పరిచయం ఉంటుంది. భాష పాత తెలుగులో ఉంటుంది. కానీ చాలా మటుకు సులువగా అర్థమవుతుంది. ఆయా పాత్రల గురించిన పరిచయం, పురాణం పేరు కూడా ఇవ్వబడుతుంది. 

గతంలో మన తెలుగు పరిశోధనలో  పురాణ నామ చంద్రిక మరియు పురాణ నామ సంగ్రహము ఒకే టపాలో మీ ముందుకు తెచ్చాం. ఇప్పుడు ఈ పూర్వగాథాలహరి అందుకోండి. 

పూర్వగాథాలహరి






పుస్తకాలను ఎలా దిగుమతి చేసుకోవాలంటే పైన 'సహాయం' ట్యాబ్ పై నొక్కండి ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

18 September, 2017

ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు Adhunika Bhasha Shastra Siddhantalu

ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
 Adhunika Bhasha Shastra Siddhantalu
Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం Dr.P.S.Subrahmanyam

Dr.పి.యస్.సుబ్రహ్మణ్యం జగమెరిగిన  భాషాశాస్త్రపండితులు. వారు తెలుగులో అందించిన రెండు అపురూపగ్రంథాలు -
  1. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు
  2. ద్రావిడభాషలు
ఇందులో మొదటి గ్రంథాన్ని  మేము మీకు అందిస్తున్నాము. రెండవపుస్తకం అంతర్జాలంలో లభించడం లేదు.

అన్నట్టు, ఈ రెండుపుస్తకాలను తెలుగువిశ్వవిద్యాలయంవారు ముద్రించి అమ్ముతున్నారు. మీరూ ఒకప్రతి కొని పెట్టుకొండి. లేదంటే, అవి దొరకనప్పుడు బాధ పడతారు.
ఈ పుస్తకాలను తెలుగు భాషాసాహిత్యాభిమానులు,భాషాశాస్త్రాభిమానులు,విద్యార్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు, ఉపాధ్యాయులు..... ఒకమాటలో చెప్పాలంటే, ప్రతి యింట ఉండదగిన అపురూప గ్రంథాలు. ఇప్పుడుమీకు  'ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు' గ్రంథాన్ని అందిస్తున్నాము. 

                                      ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు

సూచనః 
తెలుగులో ఎన్నో గ్రంథాలను అందిస్తూ సేవ చేస్తున్న ఉచితగురుకులవిద్య వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ని దిగుమతి చేసుకొని, పుస్తకాలను చదువుకోండి. లంకె -
    


30 August, 2016

ఆంధ్ర వాఙ్మయారంభ దశ Andhravangmaya Arambhadasha

ఆంధ్ర వాఙ్మయారంభ దశ 
 Andhravangmaya Arambhadasha



రెండు భాగాల దివాకర్ల వేంకటావధానిగారి పరిశోధనాగ్రంథం ప్రాఙ్నన్నయ యుగం గురించి విపులంగా చర్చించడమే కాక భారతావతరణాన్నీ స్పృశిస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు సమర్పించిన తొలితరం పరిశోధనాగ్రంథం. అపురూపమైన సంప్రదింపు గ్రంథం.

19 March, 2016

ఆంధ్ర కవుల చరిత్రము Andhra Kavula Charitramu (Complete)

ఆంధ్ర కవుల చరిత్రము (సమగ్రం) Andhra Kavula Charitramu (3 Parts)
కందుకూరి వీరేశలింగం Kandukuri Veeresha lingam




10 November, 2015

వాడుక తెలుగులో అపప్రయోగాలు vaduka Telugulo Apaprayogalu Ravva SriHari

రవ్వా శ్రీహరి గారు రచించిన ఈ పుస్తకం తెలుగువారందరికీ ఎల్లకాలం సంప్రదింపు గ్రంథమే. ఈ అద్భుతమైన పుస్తకాన్ని దిగుమతి చేసుకుని, చదివి ఆనందించండి.

04 October, 2015

ఆర్ష విజ్ఞాన సర్వస్వం Arsha vijgnana sarvasvam



వేదాల గురించి సమగ్రంగా చర్చించాలని తితిదే వారు ప్రచురించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం మూడు భాగాలను ఇక్కడ అందిస్తున్నాము.

05 May, 2015

దర్శనదర్పణము Darshana Darpanamu

దర్శనదర్పణము Darshana Darpanamu
చివుకుల అప్పయ్య శాస్త్రి chivukula Appayya Saastri


షడ్దర్శనములు మన ప్రాచీనభారతీయ విజ్ఞాన వికాసానికి బాటలు వేసిన ఋషి ప్రోక్తాలైన గ్రంథాలు. చివుకుల అప్పయ్య శాస్త్రి గారు వ్రాసిన ఈ గ్రంథంలో భారతీయ షడ్దర్శనాల పరిచయం ఉంది.

అనుసరించువారు