19 March, 2013

ఆంధ్ర ప్రతాప రుద్రయశోభూషణం Andhra Pratapa rudra yasho Bhushanam

ఆంధ్ర ప్రతాప రుద్రయశోభూషణం

 Andhra Pratapa rudra yasho Bhushanam

జమ్ములమడక మాధవరామశర్మగారు తెలుగువారిని అనుగ్రహించేందుకు సంస్కృతంలో విద్యానాథుడు వ్రాసిన ప్రతాపరుద్ర యశోభూషణాన్ని తెలుగులో అనువదించి అనుగ్రహించారు. సాహిత్య లక్షణాలకు ప్రతాపరుద్రుడు లక్ష్యంగా వ్రాసిన గ్రంథమిది. ప్రతాపరుద్రీయ యశోభూషణం తెలుగువారందరికీ యశోభూషణం.

కావ్యం, కావ్యహేతువులు, రసం,ధ్వని,వక్రోక్తి మొదలగు మాటలకు శాస్త్రీయమైన అవగాహన కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం మరొక్కసారి మన ప్రాచీన సాహిత్య విజ్ఞానానికి మార్గం చూపెడుతుంది.ఇటువంటివాటిని చదువాల్సిన అవసరం ఈ కాలానికి మనందరికీ ఎంతైనా ఉంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

1.ఆంధ్ర ప్రతాప రుద్రయశోభూషణం - ప్రథమ భాగం 

ఆన్‌లైన్‌లో చదవడానికి                 దిగుమతి చేసుకోవడానికి

2.ఆంధ్ర ప్రతాప రుద్రయశోభూషణం - ద్వితీయభాగం
ఆన్‌లైన్‌లో చదవడానికి                 దిగుమతి చేసుకోవడానికి

పై నొక్కండి.

ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని  పంచుకోండి.

18 March, 2013

భారతము - మహిళాదర్శనము (Bhaaratham- Mahila Darshanam)

భారతము - మహిళాదర్శనము 
(Bhaaratham- Mahila Darshanam)

డా.యన్.శాంతమ్మగారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతవ్యాసమిది. ఇందులో భారతం లోని దాదాపు 600 మంది మహిళాపాత్రలను ఏరి కూర్చి వాటికి సంబంధించిన విశెషాలను అధ్యయనపూర్వకంగా అందించారు.

సంస్కృత వాఙ్మయ/ సాహిత్య చరిత్ర History of Sanskrit Literature

సంస్కృత వాఙ్మయ/ సాహిత్య చరిత్ర
                               History of Sanskrit Literature

మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు మొదట సంస్కృత వాఙ్మయ చరిత్రను విపులంగా రెండు భాగాల్లో రచించారు. కాగా డా. ముదిగొండ గోపాలరెడ్డి, యశోదారెడ్డిగార్లు మళ్ళీ స్నాతకోత్తరస్థాయి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడానికి అంటూ సంస్కృత సాహిత్య చరిత్ర అని వ్రాశారు.

ఈ పుస్తకాలు M.A., M.Phil., Ph.D., UGC NET, Civil services......మొదలైన విద్యార్థులు/పరీక్షార్థులందరికీ అత్యంతోపయోగకరాలు. కాబట్టి ఇటువంటి పుస్తకాలు మీదగ్గర తప్పక ఉండాలి.

16 March, 2013

ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు Adhunika Andhra Kavitvam - Sampradaayam - Prayogaalu

ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు
 Adhunika Andhra Kavitvam - Sampradaayam - Prayogaalu 
 
 డా.సి. నారాయణ రెడ్డి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయానికి 1962 లో Ph.D. పట్టం కొరకుగాను సమర్పిచిన సిద్ధాంత వ్యాసమిది. ఇది ప్రచురించబడిన నాటినుండి ఎన్నో ముద్రణలకు నోచుకుంది. తెలుగు అభిమాన విషయంగా చదివే విద్యార్థులందరికీ ఈ పుస్తకం కరదీపిక ఆధునికాంధ్ర కవిత్వ విషయంలో. చదివి ఆనందించండి.

లేదూ "దీన్ని దిగుమతి చేసుకుందాము" అనుకుంటారూ? సరె. కింద లంకె ఇస్తున్నాం.

ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు
మీకు కావాల్సిన ఈ పుస్తకం పేరు పై నొక్కగానే మీరు దిగుమతి లంకెకు తీసుకు వెళ్ళబడతారు.

ఒక చిన్న విజ్ఞాపన. మీకు, మేము చేస్తున్న ఈ సేవ నచ్చితే, మీ సాంఘిక సంపర్క జాలాల్లో ప్రస్తావించి మరింత ఎక్కువజనాలకు సేవ చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఏ పుస్తకం నచ్చినా వెంటనే ఆ పుస్తకాన్ని ఇక్కడ దొరుకుతుందని పదుగురికి చెప్పండి. మన తెలుగుజాతికి చేసే సేవలో మీ వంతు చేయూత అందించండి.

ప్రసన్న కథా విపంచి Prasanna kathaa vipanchi

ప్రసన్న కథా విపంచి Prasanna kathaa vipanchi
(నన్నయ భారతంలోని ప్రసిద్ధ ఉపాఖ్యానాలకు వ్యాఖ్య)

ఇందులో నన్నయగారి భారతంలోని -
1. ఉదంకోపాఖ్యానం
2. గరుడోపాఖ్యానం
3. యయాతి చరిత్ర
4. శకుంతలోపాఖ్యానం
5. నలోపాఖ్యానం
6. రురూపాఖ్యానం
7. ఆస్తీకోపాఖ్యానం
8. అజగరోపాఖ్యానం 

- అనే ఉపాఖ్యానాలకు ప్రసిద్ధ పండితులతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వ్యాఖ్యానం వ్రాయించారు.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

15 March, 2013

ఆంధ్ర సదుక్తి కర్ణామృతమ్ Andhra sadukti karnamritham

ఆంధ్ర సదుక్తి కర్ణామృతమ్
Andhra sadukti karnamritham

ఇది మొదటి తెలుగు మహా సభల సందర్భంలో ప్రచురితమైన చిన్న పుస్తకం. దీని ప్రత్యేకత ఏంటంటే.......
తెలుగు భాష, భూమి,సాహిత్యం,ప్రజలు, సంస్కృతి మొదలైన విషయాలమీద తెలుగులో కాకుండా ఇతరభాషల్లో ఎవరెవరు ఏమేమి చెప్పారో.....వాటి సంకలనం. ఈ పుస్తకం చదివి సందర్భానుసారం మన తెలుగుల గొప్పతనాన్ని
ఏ దేశ మేగినా ఎందుకాలిడినా పొగడరా .......
అన్నట్లు ప్రకటిస్తూ ఉండండి.

వీటిని సేకరించిన శ్రీయుతులు సుందరేశ్వర రావు , శ్రీకృష్ణమూర్తి గారలకు మనమంతా ఋణపడి ఉన్నాం.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

ఆంధ్ర సదుక్తి కర్ణామృతమ్ Andhra sadukti karnamritham

ఈ పుస్తకం మీకు నచ్చి ఉంటే మీ బంధు మిత్రులతో పంచుకోండి. ఈ వెబ్ సైట్ ను ప్రోత్సహించండి.

రఘు వంశః - కాళిదాసు(10-19)Raghuvamsha Of Kalidasa

 రఘు వంశః - కాళిదాసు(10-19)Raghuvamsha Of Kalidasa

కాళిదాసు సంస్కృతంలో రచించిన 19 సర్గల రఘువంశ కావ్యం పంచకావ్యాల్లో ఒకటి. సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు మొట్ట మొదటగా నేర్పేది ఈ కావ్యాన్నే. దానికి తెలుగులో చక్కని వ్యాఖ్య వ్రాసినవారు కేశవపంతుల వారు. ఆ పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో దొరకడం లేదు. అటువంటి అపురూపమైన పుస్తకం తెలుగుపరిశోధన మీకు అందిస్తుంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

దిగుమతి చేసుకోవాలి అంటే......

Click on................
రఘు వంశః - కాళిదాసు (10-19)

ఈ పుస్తకం మీకు నచ్చి ఉంటే మీ బంధు మిత్రులతో పంచుకోండి. ఈ వెబ్ సైట్ ను ప్రోత్సహించండి.

14 March, 2013

రఘు వంశః -కాళిదాసు (1-09 ) Raghu vamsha of Kalidasa

రఘు వంశః -కాళిదాసు (1-09 ) Raghu vamsha of Kalidasa (తెలుగు వ్యాఖ్యతో - With Telugu Commentary)

కాళిదాసు సంస్కృతంలో రచించిన 19 సర్గల రఘువంశ కావ్యం పంచకావ్యాల్లో ఒకటి. సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు మొట్ట మొదటగా నేర్పేది ఈ కావ్యాన్నే. దానికి తెలుగులో చక్కని వ్యాఖ్య వ్రాసినవారు కేశవపంతుల వారు. ఆ పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో దొరకడం లేదు. అటువంటి అపురూపమైన పుస్తకం తెలుగుపరిశోధన మీకు అందిస్తుంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

దిగుమతి చేసుకోవాలి అంటే......
                                   రఘువంశః (ప్రథమః సర్గః)
                                    రఘువంశః (ద్వితీయః సర్గః)

ఈ పుస్తకం మీకు నచ్చి ఉంటే మీ బంధు మిత్రులతో పంచుకోండి. ఈ వెబ్ సైట్ ను ప్రోత్సహించండి.

అనుసరించువారు