ప్రౌఢ వ్యాకరణ దిగ్దర్శిని
Praudha vyakarana Dig darshini
డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Nagabhushanam
Praudha vyakarana Dig darshini
డా. అంబడిపూడి నాగభూషణం Dr. Ambadipudi Nagabhushanam
తెలుగులో వ్యాకరణంలో చిన్నయ సూరి రచించిన బాల వ్యాకరణం ప్రసిద్ధం. దాని తర్వాత వారి శిష్యులు బహుజనవల్లి సీతా రామా చార్యులవారు రచించిన ప్రౌఢవ్యాకరణం ప్రసిద్ధం. బాల వ్యాకరణం లో చెప్పగా విడిచిన విషయాలను చెప్పడానికి, అందులో చెప్పిన విషయాల సవరణకూ తాను ఆ గ్రంథం ప్రారంభించానని చెబుతారు ఆచార్యుల వారు.
ఈ వ్యాకరణ గ్రంథం పేరుకు తగినట్లుగా ప్రౌఢం. సులువుగా అర్థమయ్యేది కాదు. అటువంటి ఈ గ్రంథానికి ప్రసిద్ధ వ్యాకరణ పండితులు బాలవ్యాకరణ సూక్తులు గ్రంథ రచయిత డా. అంబడిపూడి నాగభూషణం గారు దిగ్దర్శిని వ్యాఖ్యతో విద్యార్థులకు ఉపకారం చేసారు. ఇందులో ప్రతిసూత్ర వ్యాఖ్య లేకున్నా, అవసరమైన అన్ని సూత్రాలనూ వ్యాఖ్యానించారు.