28 August, 2016

Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam

Dr.అంబడిపూడి నాగభూషణం రచనలు Dr.Ambadipudi Nagabhushanam


ప్రసిద్ధ వ్యాకరణశాస్త్ర పండితులు, భాషాశాస్త్రవేత్త, ఆచార్యులు అంబడిపూడి నాగభూషణంగారి వ్యాకరణ రచనలు లభిస్తున్నాయి. వాటిని చదవడంవల్ల మన భాషా జ్ఞానం పెరుగుతుంది. చక్కని సంప్రదింపు గ్రంథాలు. దిగుమతి చేసుకుని, ఆనందించండి.

20 August, 2016

ఆంధ్ర వాల్మీకి రచనలు Andhra Valmiki Rachanalu





ఆంధ్ర వాల్మీకి రచనలు 
Andhra Valmiki Rachanalu
 



వాసుదాసుయై యవతరించి శ్రీరామాయణమును తెనిగించి బండ్ల కెక్కించి లోకోద్ధరణ మొనరించి తమ 73 ఏట పరమవదించిరి. ఆయనే వాసుదాసు అన్వర్థ నామ ధేయుడై శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు – ఆంధ్రవాల్మీకిబిరుదాంకితులు – శ్రీ కోదండ రామ సేవక సమాజ సమాజ సంస్థాపనాచార్యులు – ఆంధ్ర వాల్మీకి రామాయణ శ్రీ కృష్ణ లీలామృత ద్విపద భగవత్ గీతాది బహుగ్రంధ కర్తలు ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధారకులు భక్తి మత ప్రచారకులు – మహర్షి – మౌని – అకుంఠిత రామభక్తుడు – తత్త్వ వేత్త – వక్త – విమర్శకులు.

ఇంకా ఊలపల్లి సాంబశివ రావు గారు ఇలా తెలుపుతున్నారు........
   
''వీరు వాసుదేవ స్వామిగా బహుథా ప్రసిద్ధులు. మహా సాధకులు,    పోతన జీవిత ఆదర్శాలతో 19-20 శతాబ్దాలలో జీవించిన మహానుభావుడు . .  కాలం మరుగున ఉండిపోయిన పండిత శ్రేష్ఠ తముడు. . .
  
శ్రీ శ్రీ శ్రీ  వాసుదేవ స్వామి, కడప, (వావికొలను వారు) సాహిత్యాన్ని లక్ష్మీనారాయణగారు ప్రాచారం చేస్తున్నారు.
మీకు తెెలిసిన విషయమే వాసుదేవ స్వామివారి గొప్పదనం. వారు  మహర్షి. వారు ప్రచురించిన  ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకం ఉన్నాయి.
వాటిని ప్రచారంచేసే కార్యం బుజాన వేసుకున్న మహానుభావులు శ్రీ లక్ష్మీనారాయణగారు కడపలో ఉంటారు.
వారి పుస్తకాలు ఉన్న వారి జాలగూడులో పెట్టారు.
మీరు అవకాశం చూసుకుని వారి గ్రంథాలను అందించి ప్రచారం కల్పించండి. మన తెలుగుభాషకు సంప్రదాయాలకు ఎంతో మేలు జరుగుతుందండి. . .'' అని.


మరి పెద్దల మాట చద్దన్నం మూట కదా? తప్పక ఆ జాలగూటిని సందర్శించండి. 
దాని చిరునామా........
                                  http://www.sribhakthisanjeevani.org/lite.html 



 

14 July, 2016

శ్రీపాద కామేశ్వర్ రావు రచనలు SriPada Kameshwar Rao

శ్రీపాద కామేశ్వర్ రావు రచనలు 
SriPada Kameshwar Rao


శ్రీపాద కామేశ్వర్ రావు గారి రచనలు ఇక్కడ కొన్నింటిని సంగ్రహిస్తున్నాము.

13 July, 2016

భమిడిపాటి కామేశ్వర్ రావు రచనలు Writings of Bhamidipati Kameshwar Rao

భమిడిపాటి కామేశ్వర్ రావు రచనలు
 Writings of Bhamidipati Kameshwar Rao
(updated)
Bhamidipati Kameshwar Rao


భమిడిపాటి వారి రచనలు అంతర్జాలంలో కొన్ని లభిస్తున్నాయి. వాటిని ఒక్క దగ్గర చేర్చే ప్రయత్నమే ఇది.

12 July, 2016

కథల పుస్తకాలు Telugu Story Books

కథల పుస్తకాలు
 Telugu Story Books



తెలుగులో వెలువడిన వివిధ కథల పుస్తకాలను అందించాలనేది మా ప్రయత్నం. దీన్ని మీరు ఆమోదిస్తారనీ, హర్షిస్తారనీ ఆశిస్తున్నాము.

11 July, 2016

వేలూరి శివరామ శాస్త్రి రచనలు Writings of Veluri Shiva Rama Shastri


వేలూరి శివరామ శాస్త్రి రచనలు
 Writings of Veluri Shiva Rama Shastri
(Updated)


వివిధ తెలుగు కవిపండితుల రచనలను మీ అభిమాన తెలుగుపరిశోధన అందిస్తున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. అందులో భాగంగా ప్రసిద్ధ శాస్త్రపండితులు, కథారచయిత అయిన వేలూరి శివరామ శాస్త్రిగారి కొన్ని రచనలను మీ ముందుకి తెస్తున్నాం.

10 July, 2016

నోరి నరసింహ శాస్త్రి రచనలు Writings of Nori Narsimha Shastri


నోరి నరసింహ శాస్త్రి రచనలు
 Writings of Nori Narsimha Shastri



నోరి నరసింహశాస్త్రి (1900 - 1978) ప్రముఖ తెలుగు కవి. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. సాహిత్యోద్యమంలో అగ్రేసరులు.

11 June, 2016

ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక Andhra Patrika Svarnotsava Sanchika


ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక 
Andhra Patrika Svarnotsava Sanchika

దాదా హయాత్ గారు తెలిపారు .......
వేమూరి విశ్వనాథ శర్మ గారుఎం.., ఎల్.టి., యెవరో మనకు తెలీదునాకూ తెలీదువారు 1925 నాటికి నలభై వుత్తరాలు సేకరించారుఅవి అప్పటికే నూటయాభైసంవత్సరాలనాటివితంజావూరు రాజ్య వాస్తవ్యులకు సంబంధించిన తెలుగు వుత్తరాలుఇప్పుడు తమిళం ప్రధాన భాషగా వున్న తంజావూరు ప్రాంతంలో ఒకప్పుడు తెలుగేప్రధానభాషగా అందరూ వాడేవారని నిరూపించడానికి వాటిలో మచ్చుకు కొన్ని వుత్తరాలు వారు 'ఆంధ్రపత్రిక ' 1925 క్రోధన సంవత్సరాది సంచికలో 'దక్షిణాది తెలుగు; కొన్ని పాత వుత్తరాలు ' అనే పేరుగల వ్యాసంలో ప్రకటించారు.

అనుసరించువారు