Showing posts with label Kavya-Prabandham. Show all posts
Showing posts with label Kavya-Prabandham. Show all posts

08 April, 2020

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీనాథ కవిసార్వభౌముడు - రచనలు 
 Srinatha Kavi Sarvabhaumuni Rachanalu

శ్రీకారంతోనే తెలుగు సాహిత్య ఆరంభం. తెలుగు సాహిత్య సముద్రంలో శ్రీనాథ మహా కవి ఉవ్వెత్తుత్తున ఎగిసిపడిన తరంగం. శ్రీనాథుని చదవడం జీవితానికి ఒక తృప్తి. 

20 October, 2018

పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్యా సహితం Panduranga Mahathmyam - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం - పామర వ్యాఖ్య Panduranga Mahathmyamu - Pamara vyakhya


పాండురంగ మాహాత్మ్యం-పామర వ్యాఖ్య



తెలుగు సాహిత్యంతో ఏ కొంచెం పరిచయం ఉన్నవారయినా తెనాలి రామకృష్ణ కవి గూర్చి వినక ఉండరు. ఆయన రాసిన పాండురంగ మాహాత్మ్యం కూడా ప్రసిద్ధమే. అది ప్రౌఢ ప్రబంధం.  గతంలో ఈ గ్రంథాన్ని బులుసు వేంకటరమణయ్యగారి టీకతో తెలుగుపరిశోధన మీకు అందించింది. ఇక ఇప్పుడు 'పామర' వ్యాఖ్యతో మీకు అందించే అవకాశం కల్పించినవారు రసజ్ఞభారతి వ్యవస్థాపకులు ఆచార్య ఆర్.వి.కుమార్ గారు. వారికి సహస్రానేక కృతజ్ఞతాభివందనాలు.

ఈ 'పామర' వ్యాఖ్యను మనకొరకు అందించినవారు డా.దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు. వారు వృత్తిరీత్యా సామాన్యులకు దురవగాహమైన ఎన్నో విషయాలను పరిశీలించి లోకసామాన్యానికి అర్థమయ్యేతీరులో వ్యాఖ్యానించి చెప్పే రేడియాలజిష్టు. వారు తమ ఆ తృతీయనేత్రాన్ని  సాహిత్యంలో కూడా పారించారు. ఇంకేం సామాన్యులకు పాండురంగ మహాత్మ్యం అర్థం కావడం కష్టం. దాన్ని కూడా పరిశీలించి, మనకు  వ్యాఖ్యానించి అందించారు.  అదీ అందరికీ ఉచితంగా అందించాలనే సత్సంకల్పంతో .... 

ఈ రసజ్ఞభారతి గూర్చి, వ్యాఖ్యా రచయితగూర్చి, వారి మిత్రబృందంగూర్చి అన్ని విషయాలను ఆ పుస్తకంలోనే చదువండి. 

మరింకేం ఆలస్యం .......


పాండురంగ మాహాత్మ్యం-పామరవ్యాఖ్య by Dr.Pandu Ranga Sharma Ramaka on Scribd




ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవాలనుకుంటే .......


పై నొక్కండి.

ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

07 June, 2018

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) Vasucharitramu (Savyakhya)

వసుచరిత్రము (సవ్యాఖ్యానం) 
Vasucharitramu (Savyakhya)
రామరాజ భూషణుడు Ramaraja Bhushanudu

ప్రబంధయుగములో వెలువడిన అత్యుత్తమసాహిత్యంలో రామరాజకృత వసుచరిత్రము ప్రముఖము. ఈ ప్రబంధం ప్రౌఢము. వ్యాఖ్యానరహితంగా అర్థమయ్యేది కాదు.

04 June, 2018

ప్రబంధాలు - శృంగారం-ప్రయోగాలు Prabandhalu-Sringaram-Prayogalu

ప్రబంధాలు - శృంగారం-ప్రయోగాలు 
Prabandhalu-Sringaram-Prayogalu
బి.రాములు B.Ramulu


చార్యులు బి.రాములు గారు హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత వ్యాసం.

02 May, 2016

విష్ణుమాయా విలాసము Vishnu maya Vilasamu of Kankanti Papi Raju

విష్ణుమాయా విలాసము   
 Vishnu maya Vilasamu of  Kankanti Papi Raju



గతంలో తెలుగు పరిశోధన కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణాన్ని ప్రకటించింది. ఇక ఇప్పుడు అతని మరొక కృతి విష్ణుమాయావిలాసము ను కూడా ప్రకటించి, కవి ఋణాన్ని, భాషా సాహిత్య ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది మీ తెలుగు పరిశోధన.

24 January, 2016

పురాణ నామ చంద్రిక Purana Nama Chandrika

పూర్వగాధాలహరి ప్రసిద్ధమైన పూర్వ కథా గ్రంథం. అందులో మన పురాణాల్లోని వివిధ పాత్రలు,స్థలాలు మొదలైన వాని పేర్లు, వాని విశేషాలూ ఉంటాయి. అటువంటివే ఈ పురాణ నామ చంద్రిక, పురాణ నామ సంగ్రహము.

Purana Nama Chandrika

14 January, 2016

మనుచరిత్ర (సవ్యాఖ్యానము) Manu Charitra

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొట్టమొదటి ప్రబంధము. ఈ రచనతోటే అల్లసానివానికి ఆంధ్రకవితాపితామహుడనే పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని సవ్యాఖ్యానంగా మీకు అందించడం తెలుగు పరిశోధన కు సంతోషం.

12 January, 2016

పాండురంగ మాహాత్మ్యం (సవ్యాఖ్యానం) Panduranga Mahatmyam Tenali Ramakrishna Kavi

తెనాలి రామకృష్ణకవి రచించిన పాండురంగ మాహాత్మ్యం ప్రౌఢ ప్రబంధం. వ్యాఖ్యాన సహితంగా మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఈ పుస్తకం అంతర్జాలం లో లభించడం అపురూపం. రసికులైన పాఠకులు దీనిని దిగుమతి చేసుకుని, చదివి, ఆనందింతురు గాక.


27 September, 2015

రాధికా సాంత్వనము Radhikaa Santvanamu ఇళా దేవీయం, Ila dEveeyam



తెలుగులో వెలువడిన శృంగార కావ్యము ఈ రాధికా సాంత్వనము అనే ప్రబంధము. దీనికి ఇళాదేవీయంఉ అనే మరో పేరుకూడా ఉంది. దీనిని ముద్దు పళని అనే తంజావూరు కవయిత్రి వ్రాసారు.

09 September, 2015

నిర్వచనోత్తర రామాయణం Nirvachanottra Ramayanam

నిర్వచనోత్తర రామాయణం Parijata Apaharanamu
తిక్కన Tikkana




16 August, 2015

శశాంకవిజయము Shashanka vijayamu

శశాంకవిజయము
Shashanka vijayamu
శేషము వేంకటపతి Sheshamu Venkatapati



ప్రబంధానంతర యుగంలో వెలువడిన శృంగారకావ్యాల్లో ఈ ప్రబంధం కూడా ఒకటి. కావ్యమంతా శృంగారరసం ఓలలాడుతుంది. చక్కని కావ్యం.

ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. తప్పక దీన్ని దిగుమతి చేసుకోండి.


చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

28 April, 2015

దశరథరాజ నందన చరిత్ర Dasharatharaaja nandana charitra (నిరోష్ఠ్య రామాయణ కావ్యం)


దశరథరాజ నందన చరిత్ర
 Dasharatharaaja nandana charitra
(నిరోష్ఠ్య రామాయణ కావ్యం)
మరింగంటి సింగరాచార్య Maringanti Singara acharya


ఓష్ఠ్యములు అనేది వ్యాకరణ పారిభాషికపదం. ఓష్ఠములు అంటే పెదవులు. ఓష్ఠముల సహాయంయంతో ఉచ్చరించే అక్షరాలను ఓష్ఠ్యములు అంటారు. అవి - ప,ఫ,బ,భ,మ అనేవి. ఆ అక్షరాలు లేకుండా వ్రాయడాన్ని "నిరోష్ఠ్యంగా" వ్రాయడం అంటారు. రాసేదేమో రామాయణం. "రామ" అనే మాటలోనే ‘మ’ అనే ఓష్ఠ్యం ఉంది కదా? మరి రామాయణమంతా నిరోష్ఠ్యంగా రాయడమెలా? అందుకే కావ్యం పేరు కూడా ‘దశరథరాజ నందన చరిత్ర’ అని నిరోష్ఠ్యంగా పెట్టారు.

03 December, 2014

నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం) Nannechoduni Kumara sambhavam

నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం) 
Nannechoduni Kumara sambhavam

నన్నెచోడుడు అత్యంత ప్రాచీనుడైన కవి. ఈయన నన్నయకు పూర్వుడనీ వాదించిన పండితులున్నారు. ఆ వివాదాలను పక్కకు పెడితే, నన్నెచోడుని కవిత్వం చదివి రసానుభవంపొందాలి. దాని వ్యాఖ్యానం లేకుంటే అది కొంత కష్టం. జాను తెనుగు దానికి కారణం. తెలుగునే చదువులో మరుస్తున్న ఈ రోజుల్లో వ్యాఖ్యానసహితమైన ఈ పుస్తకం అపురూపమే కదూ?
వికీపీడియా నుండి-

నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడతమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివస్కాందవాయుబ్రహ్మాండ పురాణాల్లోనూ, భారతరామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.




Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి
ఇవి కూడా చూడండి:-  

                నన్నెచోడుని పదప్రయోగ సూచిక 

నన్నెచోడుని కవిత్వము 

28 August, 2014

రాఘవ పాండవీయం (సవ్యాఖ్యానం) Raghava Pandaviyam

రాఘవ పాండవీయం (సవ్యాఖ్యానం) 



పింగళి సూరన  రచించిన రాఘవ పాండవీయం అనే రెండర్థాల కావ్యం (ద్వ్యర్థి కావ్యం) వ్యాఖ్యాన సహితంగా   ప్రస్తుతం లభిస్తుంది.

27 August, 2014

ఆముక్త మాల్యద (సవ్యాఖ్యానం) Amukta Malyada

ఆముక్త మాల్యద (సవ్యాఖ్యానం) 
Amukta Malyada
      శ్రీ కృష్ణ దేవ రాయలు Srikrishna Devaraya











శ్రీ కృష్ణ దేవ రాయలు  రచించిన ఆముక్త మాల్యద వ్యాఖ్యాన సహితంగా   ప్రస్తుతం లభిస్తుంది.

06 May, 2014

కవికర్ణ రసాయనం - సంకుసాల నృసింహ కవి Kavikarna Rasayanam - Sankusala Nrisimha kavi

కవికర్ణ రసాయనం - సంకుసాల నృసింహ కవి
Kavikarna Rasayanam - Sankusala Nrisimha kavi

తెలుగు పండిత లోకంలో

తే. గీ. ఒత్తుకొని వచ్చు కటి కుచో ద్వృత్తి
చూచితరుణి తను మధ్య మెచటికో తొలగి
పోయెఉండెనేనియు కనబడ కుండె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కున్దతరమే
అనే పద్యం ప్రసిద్ధం. ఈ పద్యం వ్రాసినవారు సంకుసాల నృసింహ కవి. ఆయన వ్రాసిన కవికర్ణ రసాయనం లోనిది ఈ పద్యం.

10 March, 2014

అనిరుద్ధ చరిత్ర Aniruddha Charitra

అనిరుద్ధ చరిత్ర Aniruddha Charitra
కనుపర్తి అబ్బయామాత్య Kanuparti Abbaya Amatya


కనుపర్తి అబ్బయామాత్య రచించిన అనిరుద్ధ చరిత్ర అనే ప్రబంధాన్ని ఇక్కడ పొందండి.

29 June, 2013

ఆంధ్ర ప్రశస్తి Andhra Prashashti

ఆంధ్ర ప్రశస్తి Andhra Prashashti
విశ్వనాథ సత్య నారాయణ Vishwa Natha Sathya Narayana

Vishva Natha Sathya Narayana

తెలుగు రాజుల చరిత్రలు వర్ణించే చారిత్రిక కావ్యమిది. ఇందులో శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు నుండి మొదలిడి తెలుగు రాజుల కథలు పద్య ఖంద కావ్యాల్లో వర్ణించారు విశ్వనాథ వారు. ఈ ఖండ కావ్య సంపుటి చదివి, తెలుగువారు తమ పూర్వ వైభవాన్ని తెలుసుకొని గర్వంతో పొంగి పోవాలి. అందుకోండి ఈ కానుక.

08 June, 2013

పారిజాతాపహరణము Parijata Apaharanamu

పారిజాతాపహరణము Parijata Apaharanamu
నంది తిమ్మన Nandi Timmana



ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని నంది తిమ్మన కవిత్వానికి పేరు. ఆయన వ్రాసిన పారిజాతాపహరణము అన్ని విధాలైన ప్రబంధ లక్షణాలను కలబోసుకున్నది. సత్యభామ వామ పాదంతో శ్రీకృష్ణుని తన్నినట్లు వ్రాసి, తెలుగు వారిలో ప్రచారంలోకి తెచ్చిన కవి.
"......అచ్చో వామపాదంబునన్ తొలగంద్రోచె లతాంగి, అట్లయగు, నాథుల్ నేరముల్ సేయ పేరలుకం జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే" అంటూ.

14 May, 2013

ఉత్తర హరివంశము Uttara Harivamsham

ఉత్తర హరివంశము  Uttara Harivamsham
నాచన సోమనాథుడు Nachana Somanathudu


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు