తెలుగులో వెలువడిన శృంగార కావ్యము ఈ రాధికా సాంత్వనము అనే ప్రబంధము. దీనికి ఇళాదేవీయంఉ అనే మరో పేరుకూడా ఉంది. దీనిని ముద్దు పళని అనే తంజావూరు కవయిత్రి వ్రాసారు.
కవయిత్రి ముద్దుపళని[మార్చు]
కవయిత్రి ముద్దుపళని గురించి రెండు మాటలు : 1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసిం హుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త అయిన ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో “రాధికా సాంత్వనం ” రచనను చేపట్టారు. దురదృష్టం కొద్దీ మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని తీసిపారేసిన అప్పటి పండిత పామరులు క్షమార్హులు కారు. మన అదృష్టం కొద్దీ బెంగుళూరుకు చెందిన నాగరత్నం గారు తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. గాని బ్రిటిష్ ప్రభుత్వంతో పుస్తకన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించిన ఘనులుండేవారు. 1947లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నిషేధం ఎత్తేయించారు. కాని అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారట. తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా సాంత్వనం ను ఆరుద్రతో ప్రవేశిక రాయించింది. ఆ పుస్తకమే ప్రస్తుతం మనకు దొరుకుతోంది. మరో మాట - ఇదే ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మచ్చుకైనా ముద్దుపళని ప్రస్తావన లేదు. అదో పెద్ద విచిత్రం. మీకు ముద్దుపళని గురించి మరిన్ని వివరాలు కావాలంటే సుసీ థారు, కే.లలితల సంపాదకత్వంలో వెలువడిన విమన్ రైటింగ్ ఇన్ ఇండియా (క్రీ.పూ. 600-ఇప్పటివరకు)గ్రంథంలో చదవండి. ఇలాంటి కవిత్వాన్ని బూతు బూతని కారుకూతలు కూసేవారికి ఒక్కటే చెప్పగలం. నరాలని మెలిపెట్టించి, కోరికతో బుసలు కొట్టించి, మనసును పెడదోవ పెట్టించే సాహిత్యం మాత్రం ఖచ్చితంగా బూతు సాహిత్యం (ఎరోటిక్ లిటరేచర్). కాని హృదయానికి ఆహ్లాదం కలిగించి, ఊహలకు ఉత్తేజం అందించి, మనసుకు కొత్త రెక్కలిచ్చే మాటైనా, పాటైనా, బొమ్మైనా అది మంచి సాహిత్యమే అవుతుంది. ఆ లెక్కన చూస్తే ముద్దుపళని కవిత్వం ముచ్చటైన కవిత్వం.
ఆరుద్ర చెప్పిన ఒక్క మాట - కావ్యంలోని గుణంకన్నా కవయిత్రి కులానికి ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని. మన పూర్వులు ఆ దృష్టితోనే చిన్నచూపు చూశారు. అయితే తిరుపతి వేంకట కవులు, మల్లాది రమక్రిష్ణ శాస్త్రి తదితరులు మాత్రం రాధికా సాంత్వనానికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు.
దిగుమతికి -
రాధికా సాంత్వనము Radhikaa Santvanamu ఇళా దేవీయం, Ila dEveeyam
1 వ్యాఖ్యలు:
Post a Comment