గుండు లక్ష్మణ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ ఆనంద రామాయణము తెలుగు వారికి మరుగున పడినట్లైనది.ఇదొక అపురూప కావ్యం. సంస్కృతంలోని ఆనందరామాయణానికి ఇది అనువాదమో కాదో తెలీదు. కానీ, రసనిర్భరము. చదివి ఆనందించండి.
దిగుమతి కొరకు ..........
ఆంధ్రానంద రామాయణం Andhra Ananda Ramayanam
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
సంస్క్రతానందరామాయణానికి నిస్సందేహంగా ఇది అనువాదమే. ఈ కవి తనని తాను అనువాదకునిగా చెప్పుకున్నాడే తప్ప స్వతంత్ర రచన చేస్తున్నాడనో, మూలగ్రంథాన్ని తెలుగులో పునర్మిస్తున్నాడనో చెప్పుకోలేదు. ఈ కావ్యానికి పీఠిక రాసిన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు కూడా ఈ కవి ‘మిక్కిలి ఛాందసముగా’ - అంటే మూలానికి మరీ దగ్గరగా - వర్ణించాడు కాబట్టి గుణదోషాలు అనువాదకునివిగా కాక మూలగ్రంథానికే ఆపాదించాల్సివుంటుందని సూచించారు.
ఆనంద రామాయణం వాల్మీకి రచనగానే ప్రసిద్ధం. అయితే రెండు రామాయణాలకూ కథాసందర్భాల్లో అక్కడక్కడా తేడాలున్నాయి. అలా ఎందుకు జరిగిందో అనడానికి ఈ కవి చెబుతున్న సమాధానం - ‘‘కల్పభేదాత్కథాభేద:’’ - సృష్టిలోనే భేదాలున్నప్పుడు కథల్లో వుండవా అని! నవనాగరికులమైన మనకు ఈ సమాధానం సంతృప్తికరంగా వుండదనేది కూడా కవి చెబుతున్నాడు. సాహిత్య చరిత్రకారులకు కావలసినంత గ్రాసం.
ఈ అపురూప గ్రంథం తెలుగులో వుందనేది నాకిప్పటివరకూ తెలీదు. ఇప్పుడు చూస్తున్నాను.
అంతర్జాల మహిమ!
పీఠికలేం చెబితేనేమి? కావ్యం ప్రౌఢంగా కమ్మగా వుంది.
మొదటి పేజీలో ప్రచరురణ కాలం 1939గా కనబడుతున్నా 1952 నాటి ప్రతి.
Sir I want telugu nataka vikasam book by Dr.ponangi Sri rama apparao
Post a Comment