సాహిత్య పదకోశము
Sahithya pada koshamu
ఎన్నో ఏళ్ళక్రితం ప్రచురితమైన పుస్తకం ఇది. సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన సాహిత్యపదకోశాలు హిందిలో ఉన్నా తెలుగులో లేదనే లోటు లేకుండా తెలుగుఅకాడమీ వారు ప్రచురించారు చాలానాళ్ళక్రితం. అదృష్టవశాత్తు నాకు ఈ మధ్య తారసపడింది. ఈ పుస్తకంకోసం ఎన్నాళ్లనుండో తాపత్రయపడుతున్నాను. కానీ, దొరకడం లేదు. నేను గతంలో కొనుక్కున్న మూడు ప్రతులూ సాహితీపిపాసుకులైన మిత్రులెవరికో ఇచ్చాను. ఏమయితేనేం ఈ విధంగానైనా మనకు లభించేట్టు చేసిన ఆ అజ్ఞాత'ఈ'పుస్తకదాతకు శతకోటి నమస్కారాలు.
ఈ పుసకంలో సాహిత్య,నాటక,అలంకార విభాగాల్లో సాహిత్యశాస్త్ర పారిభాషికపదాలన్నీ అకారాదిక్రమంలో ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు .... ఈ పుస్తకాన్ని పొంది, ఆనందించాలని మా కోరిక.
దిగుమతి కొరకు లంకె .......
- పై నొక్కండి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
1 వ్యాఖ్యలు:
నాకు గుమ్మలూరి సత్యనారాయణ గారు రచించిన "హాలిక సూక్తులు" పుస్తకం అవసరమైయున్నది. దాని pdf వుంటే దయచేసి పంచగలరు. ఒకవేళ పుస్తకం వున్నా చిరునామా తెలియజేయగలరు. ధన్యవాదాలు
Post a Comment