మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు Sripada Subrahmanya Shastry Kathalu

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
 Sripada Subrahmanya Shastry Kathaluసుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసారు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసారు.

 వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, ఆయుర్వేద యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - అనుభవాలూ-జ్ఞాపకాలూనూ ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచారు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు 'ప్రబుద్ధాంధ్ర' పత్రిక నిర్వహించారు. గిడుగు రామమూర్తి లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక అష్టావధానాలు కుడా చేసారు. 1956 లో కనకాభిషేకం అందుకున్నారు.

     వీరి కథలను అంతర్జాలంలో లభించినవాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము.

  1. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - 1    
  2. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - 2
  3. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - 3
  4. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - 4
  5. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - 5
  6. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - 6ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

7 వ్యాఖ్యలు:

Varaprasad.k said...

ఎప్పటినుంచో వడ్లగింజలు గురించి వినటమే కానీ దొరకలేదు. మొన్న దొరికాక నాలుగైదు సార్లు చదివితే కానీ తనివి తీరలేదు. అప్పటినుండి ఆయన గురించి వెతుకుతుంటే, మంచి కథలు అందించారు.అభినందనలు.

Raveendra said...

మూడవ భాగం కూడా , రెండవ భాగమే. మూడవ భాగం ప్రసాదించ విన్నపం

gln sarma said...

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిపై చామర్తి కనకయ్య గారి పుస్తకం where we can find రీసెర్చ్ అంశం “ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథల సమగ్ర సమీక్ష" ?

gln sarma said...

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిపై చామర్తి కనకయ్య గారి పుస్తకం where we can find రీసెర్చ్ అంశం “ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథల సమగ్ర సమీక్ష" ?

పరాశ్రీ said...

నమస్కారం
నేను ఎక్కడో ఒక చోట చదివిన గుర్తు
ఎవరో ఒక కవి తన చిన్నతనం లో తాను వ్రాసిన పుస్తకాన్ని తానే పై తరగతిలో పాఠ్యాంశం గా చదివారు అని.
దయచేసి ఆయన పేరు చెప్పగలరు

Wiz said...

తను వ్రాసిన పుస్తకాన్నే తస్నే తరగతిలో పాఠ్యాంశంగా చదివి పరీక్ష కూడా వ్రాసిన వారు. సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు.

Subhanand said...

శ్రీపాదవారి ఆత్మబలి నవల ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా

Post a Comment

అనుసరించువారు