Showing posts with label Literary Criticism. Show all posts
Showing posts with label Literary Criticism. Show all posts

18 August, 2019

కాదంబరీ రసజ్ఞత పేరాల భరతశర్మ Kadambari Rasajnata Perala Bharatha Sharma

కాదంబరీ రసజ్ఞత పేరాల భరతశర్మ 
Kadambari Rasajnata Perala Bharatha Sharma



 "తెలుగునాట విశ్వనాథ సత్యనారాయణ  గారి పేరు స్మరించగానే స్ఫురణ కు వచ్చే అతి ముఖ్యమైన వ్యక్తుల లో శ్రీ పేరాల భరతశర్మ గారు ముఖ్యులు..
విశ్వనాథ వారి అంతరంగాన్నే కాదు , వారి రచనల అంతరంగపు లోతుల్నీ తెలిసిన , లోకానికి తెలిపిన పండితవిమర్శకులు అయిన శ్రీ పేరాల వారు కవి , అవధాని , నాటక కర్త , గేయ నాటికాకర్తగా , వక్త గా ఆంధ్ర దేశాన పేరెన్నిక గన్న వారు ..
1933 , ఫిబ్రవరి 2 వతేదీన , బాలకృష్ణయ్య , రాజ్యలక్ష్మమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా చీరాల లో జన్మించిన శర్మగారి ఉన్నత విద్యాభాసం గుంటూరు లోని హిందూ కళాశాల లోనూ , విజయవాడ ఎస్.ఆర్ & సి.వి.ఆర్ కళాశాలలలో జరిగింది ..
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే భరతశర్మ గారు తాము చదివిన  S R & C V R  కళాశాల లోనే ట్యూటర్ గా చేరి ప్రైవేటుగా బెనారస్ విశ్వ విద్యాలయం నుండి సంస్కృతం లో ఎం. ఏ పూర్తి
చేశారు ..
1960 వరకు విజయవాడలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదోన్నతి పై  కాకినాడ P R కాలేజీకి వెళ్ళి 1985 వరకు అక్కడ ఉద్యోగించారు .. తరువాత ప్రిన్స్ పాల్ గా మరోసారి పదోన్నతి పొంది విజయనగరం లోని మహారాజ వారి సంస్కృత కళాశాల లో వృత్తిన  విజయవంతంగా నిర్వహించి 1991 లో ఉద్యోగ విరమణ చేశారు ..
2002 , డిసెంబరు 13 న పరమపదించే వరకు వారు నిత్యసాహితీవ్రతులై  దాదాపు 400 కుపైగా అవధానాలను , వందలాది సాహిత్య ప్రసంగాలను అందించిన శ్రీ పేరాల భరత శర్మ గారు ధన్యమూర్తులు.."
                                                               - డా.ఆర్.వి.కుమార్ గారు


"నాన్నగారు వ్రాసిన " కాదంబరీ రసజ్ఞత " బాణ కాదంబరి పై ఒక ఆధికారకమైన విమర్శ గ్రంథం.  1978 లో ఒక రోజు "నేనొక పుస్తకం వ్రాద్దామనుకుంటున్నాను.  నువ్వు లేఖకుడిగా వుంటానంటే " అన్నారు నాదగ్గరకొచ్చి. అప్పుడు నేను బి కాం మొదటి సంవత్సరం చదువుతున్నాను.  నేను సరేనన్నాను .  భుజం తట్టి, "నేనెప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వేస్థితిలో వున్నా పగలైనా రాత్రైనా, అర్ధరాత్రైనా నువ్వు లేఖకుడిగా సహకరిస్తానంటే నేను మొదలు పెడతానాన్నా" అన్నారు. హఠాత్తుగా అర్ధరాత్రి నిద్రలేపి పెన్ను, pad ఇచ్చి వ్రాయించిన రోజులెన్నో.  కాకినాడలో ఆలమూరు వారింట్లో వుండే వాళ్ళం ఆరోజుల్లో.  సడెన్గా పెరట్లోకి వెళ్లి బావి గట్టుమీద కూర్చునేవారు. పక్కవాళ్ళ సరిహద్దు గోడమీద కూర్చునేవారు. లేదా ముందుగది కిటికీలో వ్రేలాడుతూ కూర్చుని చెపుతుండేవారు. ఒకప్పుడు చాలాసేపు మౌనంగా కళ్ళుమూసుకుని కూర్చుండి పోయేవారు.  ఏదిఏమైనా నాన్నగారితో ఒప్పందం నేను వారు చెప్పేదాకా ఆయన దగ్గర కూర్చుని  వ్రాయడమే.  ఇప్పటికీ ఆ వ్రాతప్రతి విశాఖలో మాయింట్లో వుంది.
ఎంతమంది విశ్వవిద్యాలయ విద్యార్థులకు, అధ్యాపకులకు ఈ పుస్తకం ఎంత ఉపయోగపడిందో! ఎన్ని మహత్తరమైన విశేషాలు అందులో వివరించారో. దేశంలో ( కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు) అన్ని ప్రముఖ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, నగర గ్రంథాలయాలలో ఈ పుస్తకం వున్నదో నాకు బాగా తెలుసు.  నేను నాన్నగారు కలిసి ఈ పుస్తకాన్ని వి పి పి ద్వారా ఎన్ని విద్యా సంస్థలకు పంపించామో నాకు బాగా గుర్తు.  ఈ పుస్తకావిష్కరణసభ కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం లో జరిగింది.  
ఈ కాదంబరిలో ఎన్నో శ్రీవిద్యా   రహస్యములు చెప్పాను నేను అనేవారు.  నాకు అంతగా అర్థమయ్యేది కాదు.  విని వూరుకునేవాడిని .  మా మధ్య ఒప్పందం వారు చెప్పింది నేను వ్రాసి పెట్టటమే కదా!  కానీ ఈ పుస్తకానికి అభిప్రాయం వ్రాసిన  శ్రీవెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ".......................ప్రకృతమునకు వత్తును.  కాదంబరీ రసజ్ఞత యని పేరు పెట్టి యీ గ్రంథమును రచించిన శ్రీ పేరాల భరతశర్మగారు నిద్రాహారము లెంతకాలము లేకుండ
నింత గ్రంథము రచించిరో యనుకొంటిని. కాని ఆహారనిద్రలకు దూరముకాకుం
డనే పిఠాపురరాజా ప్రభుత్వకళాశాల (కాకినాడ) లో సంస్కృతోపన్యాసకత్వము ,
యథాపూర్వము నడుపుకొనుచునే రసజ్ఞులగు పెద్దలు అవధానార్థ మాహ్వానించినపుడు అష్టశతావధానములు చేయుచునే యింత విపులమైన విమర్శనముతో అసాధారణ
కవితాధురంధరుఁడైన భట్టబాణ మహాకవియొక్క నిరుపమ మైన కాదంబరీ గద్య
కావ్యసాగరమును మథించి యందలి యమృతమును ఆంధ్రలోకమున కెట్లoదింపఁ
గలిగిరో ! అని ఆశ్చర్యపడితిని. ప్రతిభాశాలి కసాధ్య మేముండును ! అనుకొంటిని.
2. కాదంబరి యన కల్లుకాదు. సరస్వతి అని యనుకొంటిమికదా ! బాణుని
సరస్వతియన అతని రచనయగు కథాకావ్యము అన్నమాట. దానియందు రసమున్నదని ఆ రసము నెఱిఁగినవారు కాదంబరీ రసజ్ఞులు అనుకొన్నాముక దా! అట్టి రసజ్ఞులలో నొకరై న శ్రీ భరతశర్మగారు తనకుఁ గలిగిన రసజ్ఞానమును గాలికిఁబోవు
వాగ్రూపముగాఁగాక అక్షరరూపముగా నిట్లువెలువరించి తామేకాక యావదాంధ్ర వసుంధరను ధన్యమొనర్చి ధన్యులైనారు.
.............హెచ్చైనను చాదస్తమని యెవరనుకొనినను నాలుగుమాటలు వ్రాయక మానజాలనిది "కథాతత్వము" అనెడి విభాగము.  ఇందు కాదంబరి కథ యంతయు శ్రీవిద్యా పరముగా భరతశర్మగారు కామకళావిలాసము మున్నగు శాక్తమత గ్రంథముల  యాధారమున నిరూపించుట మెచ్చదగినది. 122 వ పుటలో బాణుడు కాదంబరీ కథావస్తునిర్మాణమున నొకనిగూడమైన తాత్త్వికరహస్యమునిమిడ్చెననిస్పష్టమగును.  అది వేదసమ్మతము, శాస్త్రవిహితము, యోగ సిద్ధము” అని  యుపక్రమించి శ్రీమహాత్రిపురసుందరీ పరదేవతా తత్వప్రతిపాదకమైన కామకళా విలాసమను గ్రంథమును బట్టి మనకు తెలియని యెన్నియో విషయముల నెత్తికొని
ప్రకృతకథకు సమన్వయించుట యత్యద్భుతము...........". 
ఈ సమీక్ష చదివిన తర్వాత నాన్నగారు నాతో తాను ఈ పుస్తకంలో వ్రాసానని చెప్పిన శ్రీవిద్యా రహస్యములు అన్నమాట అబ్బురపరచింది.  తానెప్పుడూ నాది మానసిక పూజ నాయనా.  నా ఉపాసన అంతా అంతర్గతమైనది అన్న మాటలకు అర్థం తెలిసింది."
                                                                                        పేరాల బాలు గారు


  గ్రంథరాజాన్ని దిగుమతి చేసుకునేందుకు ..........
                                      కాదంబరీ రసజ్ఞత
               
                                                                      ................పై నొక్కండి.



"భరత శర్మగారి సాహిత్యంపై సమగ్ర పరిశోధన రావలసి ఉంది. పేరాల సాహిత్య పీఠం  వేదికను ఏర్పరిచి సమర్ధులచే ఉపన్యాసాలు ఇప్పించడం చేయాలి.పాఠ్యగ్రంధాల్లో స్కూలు, కాలేజి, విశ్వ విద్యాలయస్థాయిల్లో వారి రచనలు వుండేటట్టు ప్రయత్ని0చాలి. 
మహాకవి మిగిల్చిపోయిన వెలుగులు జాతికి పంచవలసిన అవసరం ఉంది" 
                                                                              - బులుసు వేంకటేశ్వర్లు మాష్టారు.


 




ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

03 May, 2016

జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు Writings of Jammalamadugu Madhava Rama Sharma

జమ్మలమడుగు మాధవరామశర్మ రచనలు 
Writings of Jammalamadugu Madhava Rama Sharma

సుప్రసిద్ధ పండితులు, ఎందరో కవిపండితులను తెలుగువారికందించిన గురువరేణ్యులు జమ్మలమడుగు మాధవరామశర్మగారు.

22 April, 2016

వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు Writings of Vedam Venkata Raya Shastri

వేదము వేంకటరాయ శాస్త్రి రచనలు 
Writings of Vedam Venkata Raya Shastri


సుప్రసిద్ధ పండితులు వేదం వేంకటరాయ శాస్త్రి గారి రచనలను డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్న వానిని మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుపరిశోధన. పుస్తకాలను దిగుమతి చేసుకొని, చదివి ఆనందించండి.

03 April, 2016

తిక్కన భారతము రస పోషణము Tikkana Bharatamu Rasa Poshanamu

తిక్కన భారతము రస పోషణము 
Tikkana Bharatamu Rasa Poshanamu
డా.ఆండ్ర కమలా దేవి Dr.Andra Kamala Devi

డా.ఆండ్ర కమలాదేవి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి Ph.D. పట్టం పొందడం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.

19 March, 2016

ఆంధ్ర కవుల చరిత్రము Andhra Kavula Charitramu (Complete)

ఆంధ్ర కవుల చరిత్రము (సమగ్రం) Andhra Kavula Charitramu (3 Parts)
కందుకూరి వీరేశలింగం Kandukuri Veeresha lingam




18 March, 2016

ప్రజాకవి వేమన Praja Kavi Vemana - Dr.N.Gopi

డా.యన్.గోపి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం కొరకు సమ్ర్పించిన సిద్ధాంత గ్రంథం. ఎన్నో ఏళ్ళుగా విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంప్రదింపుగ్రంథంగా ఉన్న విశిష్ట రచన.

25 January, 2016

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)

కావ్యాలంకార సంగ్రహము (నరసభూపాలీయము) 
 kavyalamkara sangrahamu (Narasa bhupaliyam)
రామరాజభూషణుడు Ramaraja Bhushana

తెలుగులో వెలువడిన అలంకారశాస్త్ర గ్రంథమిది.

20 January, 2016

ఆరుద్ర రచనలు Writings of Arudra

ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.



03 August, 2015

Navarasa Gangadharamu నవరస గంగాధరము

29 July, 2015

Andhra Sahithya Darpanamu ఆంధ్ర సాహిత్య దర్పణము


విశ్వనాథ కవిరాజు సంస్కృతంలో రచించిన సాహిత్య దర్పణం కు తెలుగు అనువాదమిది. దీనిని వేదం వేంకటరాయ శాస్త్రి గారు అనువదించి ఉంటారు.






దిగుమతి కొరకు .......

ఆంధ్ర సాహిత్య దర్పణము

28 July, 2015

Dhwanyaaloka ధ్వన్యాలోకము


పుల్లెల శ్రీరామ చంద్రుడుగారి వ్యాఖ్యానంతో వెలువడిన ఈ ఆనందవర్ధనుని గ్రంథం చాలా అపురూపమైంది.




Dvanyaloka

02 May, 2015

దశరూపక సారము Dasha Rupaka Saramu

దశరూపక సారము Dasha Rupaka Saramu
గడియారం రామకృష్ణ శర్మ GadiyaaraM Rama krishna Sharma


మన దృశ్యకావ్యాలను రూపకాలు అంటారు. ఆ రూపకాలు పది రకాలు. అందులో ‘నాటకం’ అనే రూపకభేదం మొదటిది. ఆ మొదటి రూపకభేదమైన నాటకం పేరుతోనే మనం రూపకాలను వ్యవహరిస్తున్నాం.
మొట్టమొదటి రూపక లక్షణ గ్రంథం భరత ముని రచితమైన ‘నాట్య శాస్త్రం’ అనే గ్రంథం. భారతీయ అలంకార శాస్త్రంలో (అగ్నిపురాణం తర్వాత)వెలువడిన మొట్టమొదటి గ్రంథమది.

04 December, 2014

నన్నెచోడుని కవిత్వము Nannechoduni Kavitvamu

నన్నెచోడుని కవిత్వము
 Nannechoduni Kavitvamu
అమరేశం రాజేశ్వర శర్మ  amaresham Rajesvara Sharma

(వికీ పీడియా నుండి)
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.

02 December, 2014

నన్నయ భారతి Nannayya Bharathi 2

నన్నయ భారతి Nannayya Bharathi 2

వివిధ పత్రికల్లో నన్నయ మీద ప్రచురితమైన వ్యాసాలను సేకరించి, ఒక దగ్గర అందించాలనే సత్సంకల్పంతో తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన గ్రంథమే ఇది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, సాహిత్య రసికులు అందరూ ఆదరిస్తారని మా విశ్వాసం. నన్నయకు సంబంధిన వివిధ వ్యాసాలు ఒక్కదగ్గర లభించడం ఎంత అదృష్టం?

01 December, 2014

నన్నయ భారతి Nannayya Bharathi 1

నన్నయ భారతి Nannayya Bharathi 1

వివిధ పత్రికల్లో నన్నయ మీద ప్రచురితమైన వ్యాసాలను సేకరించి, ఒక దగ్గర అందించాలనే సత్సంకల్పంతో తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన గ్రంథమే ఇది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, సాహిత్య రసికులు అందరూ ఆదరిస్తారని మా విశ్వాసం. నన్నయకు సంబంధిన వివిధ వ్యాసాలు ఒక్కదగ్గర లభించడం ఎంత అదృష్టం?

26 August, 2014

మహాభారత విమర్శనము 2 Mahabharata Vimarshanam 2

మహాభారత విమర్శనము 2 Mahabharata Vimarshanam 2
పుట్టపర్తి నారాయణాచార్యులు






పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన మహాభారత విమర్శనము యొక్క రెండవ భాగం ప్రస్తుతం లభిస్తుంది.
ఆ అద్భుత విమర్శా గ్రంథాన్నిఇక్కడ పొందండి.

25 August, 2014

మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu

మహాభారత విమర్శనము Maha Bharatha Vimarshanamu
పుట్టపర్తి నారాయణాచార్యులు Puttaparthi Narayanacharyulu











పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన మహాభారత విమర్శనము యొక్క ప్రథమ భాగం ప్రస్తుతం లభిస్తుంది.
ఆ అద్భుత విమర్శా గ్రంథాన్నిఇక్కడ పొందండి.

20 March, 2014

పిల్లల మఱ్ఱి పినవీరభద్ర కవి Pillalamarri Pinaveerabhadrudu

పిల్లల మఱ్ఱి పినవీరభద్ర కవి
Pillalamarri Pinaveerabhadrudu
డా.జి.వి.సుబహ్మణ్యం Dr.G.V.Subrahmanyam

డా.జి.వి.సుబహ్మణ్యం రచించిన శృంగారశాకుంతలం, జైమినీభారతం పైన వ్యాసాలను ఇక్కడ పొందండి.

15 March, 2014

అర్ధ శతాబ్దపు ఆంధ్ర సాహితి
 Artha Shatabdapu Andhra Sahithi
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి Shripaada Subrahmanya Shastri

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన అర్ధ శతాబ్దపు ఆంధ్ర సాహితి గ్రంధాన్ని ఇక్కడ పొందండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

16 May, 2013

కవిత్వ తత్వ విచారము Kavitva Tatva Vicharamu

కవిత్వ తత్వ విచారము Kavitva Tatva Vicharamu
కట్టమంచి రామ లింగా రెడ్డి Kattamanchi Rama Linga Reddy



తెలుగులో వెలువడిన మొట్టమొదటి ఆధునిక సాహిత్యవిమర్శ కట్టమంచి రామ లింగా రెడ్డి గారు వ్రాసిన కవిత్వ తత్వ విచారము. పింగళి సూరన వ్రాసిన కళాపూర్ణోదయం అనే ప్రబంధాన్ని లక్ష్యంగా స్వీకరించి వ్రాసారు.

మీరిక్కడే చదువుకోవాలంటే..........


Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

అనుసరించువారు