Showing posts with label telugu lessons. Show all posts
Showing posts with label telugu lessons. Show all posts

06 April, 2020

మీరు ఈ తెలుగు పాఠాల వెబ్ సైట్ చూశారా? Have you ever visited the website for Telugu Lessons

మీరు ఈ తెలుగు పాఠాల వెబ్ సైట్ చూశారా? 
Have you ever visited the website for Telugu Lessons

తెలుగు విద్యాలయం


        మీ ఇంటిలో చదువుకుంటున్న పిల్లలు ఉండవచ్చు. లేదా డిగ్రీ చేస్తున్నవారైనా, పోటీ పరీక్షలకు వెళ్ళే వారైనా ఉండవచ్చు. ఇటువంటి వారికోసం..... తెలుగు పాఠాలు చేసి పెట్టాలనే ప్రయత్నం తెలుగుపరిశోధన మొదలు పెట్టింది. దాని కొరకు www.academy.teluguthesis.com  అనే URL వద్ద 'తెలుగు విద్యాలయం' అనే వెబ్ సైట్ ప్రారంభించాను. నా (ఊహా-) శక్తి మేరకు వీడియో పాఠాలు చేసి, Sanskrit Central అనే యూట్యూబ్ ఛానెల్ లో పాఠాలు పెట్టి, వాటి లంకెలు ఈ వెబ్ సైట్ లో పెడుతున్నాను.ఈ సైట్ లో పైన్ ఉన్న ట్యాబ్స్ లో 'విద్యాలయం' అనే ట్యాబ్ పై నొక్కితే ఆ వెబ్సైట్ చేరుకుంటారు. 

     అందులో ఎనిమిదవ తరగతి నుండి మొదలుకొని పి.జి.విద్యార్థుల వరకు అక్కరకు వచ్చే తెలుగు వ్యాకరణం పాఠాలు చేర్చాను. ఇంకా చేర్చే ప్రయత్నంలో ఉన్నాను. అంతే కాకుండా, ఎనిమిదవ తరగతి నుండి పిజి చదివే విద్యార్థులకు ఉపయోగపడే తెలుగు, సంస్కృత పాఠాలు చేసే ప్రయత్నంలో ఉన్నాను.  అక్కడ నేను చేర్చిన సాహిత్య,అలంకార, ఛందో, వ్యాకరణాది విషయాల్లోని పాఠాలను వేనిని చేర్చానో ఈ కింది టపాలో వివరించాను. చూడండి.  ఇవన్నీ అందరికీ అక్కరకు వచ్చేవే. చూడండి.

    విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షార్థులు, తెలుగు భాషా సాహిత్యాభిమానులు మొదలైన వారందరూ ఒకసారి ఆ వెబ్ సైట్ చూసి, ఆ యూట్యూబ్ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. 

  అందరి ప్రోత్సాహముంటే, మరిన్ని పాఠాలు చేసే ఉత్సాహం, సామర్థ్యం నాకు వస్తుంది.   

దయచేసి సందర్శించండి. ....






ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

అనుసరించువారు