పోతన పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సాహిత్య గోష్ఠిలో వివిధ పండితులు వివిధ అంశాలపై సమర్పించిన పదునాలుగు వ్యాసాలు ఇందులో ఉన్నాయి. రసికులైనవారికి అపురూపమైన మందార మకరందం.
తెలుగు విశ్వ విద్యాలయంవారు విజ్ఞాన సర్వస్వాలు ప్రచురించడం ఆరంభించాక సాహిత్యానికి సంబంధించిన వాటిని మూడు భాగాలు గా చేసారు.
1.తెలుగు సాహితి - (ఇది తెలుగు సాహిత్య విషయ సర్వస్వం )
2.భారత భారతి -( ఇది తెలుగును మినహాయించి, మిగిలిన భారతీయ భాషల సాహిత్య విషయ సర్వస్వం)
3.విశ్వ సాహితి - ( ఇది భారతీయ భాషలను మినహాయించి, మిగిలిన ప్రపంచ భాషల సాహిత్య విషయ సర్వస్వం)
పదహేడవ శతాబ్ది వరకు ఆంధ్రవాఙ్మయమున వెలసిన చారిత్రక కావ్యాలపై ఆంధ్రా విశ్వ విద్యాలయంలో పరిశోధన చేసి, డా. బి.అరుణ కుమారి Ph.D. పట్టం సంపాదించిన సిద్ధాంత వ్యాస గ్రంథ రాజమిది.
వాడవల్లి చక్రపాణిరావు గారు ఈ సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి,ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందారు. ఈ సిద్ధాంతవ్యాసం అందరికీ ఆసక్తికరం. కాగా పరిశోధక విద్యార్థులు ఈ సిద్ధాంత వ్యాసాన్ని తప్పకుండా ఒక్కసారి చూడాలి. పరిశోధనావ్యాస ప్రణాలిక ఎంత పకడ్బందీగా ఉండాల్లో తెలుస్తుంది. అంతెందుకు ? 26,27 పుటల్లో విషయ సూచిక ఉంది.మీరే చూడండి....
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని నంది తిమ్మన కవిత్వానికి పేరు. ఆయన వ్రాసిన పారిజాతాపహరణము అన్ని విధాలైన ప్రబంధ లక్షణాలను కలబోసుకున్నది. సత్యభామ వామ పాదంతో శ్రీకృష్ణుని తన్నినట్లు వ్రాసి, తెలుగు వారిలో ప్రచారంలోకి తెచ్చిన కవి.
"......అచ్చో వామపాదంబునన్ తొలగంద్రోచె లతాంగి, అట్లయగు, నాథుల్ నేరముల్ సేయ పేరలుకం జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే" అంటూ.