21 April, 2015

మాటలు మంత్రాలు Matalu Mantralu


మాటలు మంత్రాలు Matalu Mantralu
డా.మోపిదేవి కృష్ణ స్వామి Dr.Mopidevi Krishna svami


డా.మోపిదేవి కృష్ణ స్వామి గారి ఈ పుస్తకం మాటలు మంత్రాలు చదువదగిన పుస్తకం. మీకు నచ్చుతుందని మా నమ్మకం.

నాచన సోమన భక్తి తత్వం Nachana Somana Bhakthi Tatvam

నాచన సోమన భక్తి తత్వం
 Nachana Somana Bhakthi Tatvam
డా. గోవింద స్వామి నాయుడు Dr. Govinda swami Naidu


నన్నెచోడుని కవిత్వంపై డా. గోవింద స్వామి నాయుడు గారి విచారవిమర్శ సమగ్రంగా పొందండి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిశోధనా గ్రంథమిది.

13 February, 2015

వేములవాడ రాజేశ్వరుని మాహాత్మ్యము- అనుశీలన Vemulavada Rajeshwaruni mahatmyam- anushilana



వేములవాడ రాజేశ్వరుని మాహాత్మ్యము- అనుశీలన
Vemulavada Rajeshwaruni mahatmyam- anushilana

యం. యమున M.Yamuna



తేళ్ళ సత్యవతిగారి పర్యవేక్షణలో మామిడిపల్లి యమునగారు నాగార్జున విశ్వవిద్యాలయంనుండి M.Phil. పట్టం పొందడానికి సమర్పించిన సిద్ధాంతవ్యాస గ్రంథమిది.




Click to download.....






23 December, 2014

విజ్ఞాన దీపిక Vijnana Deepika

విజ్ఞాన దీపిక  Vijnana Deepika 


గతంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ కాలంలో  విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అన్నీ విషయాల్లో కనీస పరిజ్ఞానం కలుగాలనే ఉద్దేశంతో పండితులచే వ్రాయించి, ప్రచురించిన గ్రంథమిది.

22 December, 2014

వేణీ సంహారం Veni Samharam

వేణీ సంహారం Veni Samharam
భట్ట నారాయణ Bhatta Narayana


భట్టనారాయణ కవి రచించిన ఈ వేణీసంహార నాటకం రసలుబ్ధులు, విద్యార్థులు తప్పక చదివి ఆనందడోలికల్లో ఓలలాడుదురు గాక. దీనికి బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య మనకు మరింత మేలు చేసింది.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి

21 December, 2014

అనర్ఘరాఘవమ్ Anargha Raghavam

అనర్ఘరాఘవమ్ Anargha Raghavam
మురారి Muraari 

మురారేః తృతీయః పంథా అని ఒక లోకోక్తి. మురారి కవి వ్రాసిన అనర్ఘరాఘవ నాటకం రసలుబ్ధులు, విద్యార్థులు తప్పక చదివి ఆనందడోలికల్లో ఓలలాడుదురు గాక. దీనికి బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య మనకు మరింత మేలు చేసింది.

04 December, 2014

నన్నెచోడుని కవిత్వము Nannechoduni Kavitvamu

నన్నెచోడుని కవిత్వము
 Nannechoduni Kavitvamu
అమరేశం రాజేశ్వర శర్మ  amaresham Rajesvara Sharma

(వికీ పీడియా నుండి)
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.

03 December, 2014

నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం) Nannechoduni Kumara sambhavam

నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం) 
Nannechoduni Kumara sambhavam

నన్నెచోడుడు అత్యంత ప్రాచీనుడైన కవి. ఈయన నన్నయకు పూర్వుడనీ వాదించిన పండితులున్నారు. ఆ వివాదాలను పక్కకు పెడితే, నన్నెచోడుని కవిత్వం చదివి రసానుభవంపొందాలి. దాని వ్యాఖ్యానం లేకుంటే అది కొంత కష్టం. జాను తెనుగు దానికి కారణం. తెలుగునే చదువులో మరుస్తున్న ఈ రోజుల్లో వ్యాఖ్యానసహితమైన ఈ పుస్తకం అపురూపమే కదూ?
వికీపీడియా నుండి-

నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడతమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివస్కాందవాయుబ్రహ్మాండ పురాణాల్లోనూ, భారతరామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.




Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పైనొక్కండి
ఇవి కూడా చూడండి:-  

                నన్నెచోడుని పదప్రయోగ సూచిక 

నన్నెచోడుని కవిత్వము 

అనుసరించువారు