19 January, 2016

సురవరం ప్రతాపరెడ్డి రచనలు Suravaram Prathapa Reddy Rachanalu

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించాడు. మంచిపండితుడు1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రికసంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు.

18 January, 2016

ఆంధ్రుల సాంఘిక చరిత్ర Andhrula Sanghika Charitra

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
Andhrula Sanghika charitra
by
Suravaram Pratapa Reddy

17 January, 2016

గోల్కొండ కవుల సంచిక Golkonda Kavula Sanchika

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 281896 - ఆగస్టు 251953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. 

16 January, 2016

సాక్షి వ్యాస సంపుటి-పానుగంటి Sakshi by Panuganti

సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. 

15 January, 2016

ఆరుద్ర నాటికలు Arudra Natikalu

తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవిశ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 311925 - జూన్ 41998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.


14 January, 2016

మనుచరిత్ర (సవ్యాఖ్యానము) Manu Charitra

అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొట్టమొదటి ప్రబంధము. ఈ రచనతోటే అల్లసానివానికి ఆంధ్రకవితాపితామహుడనే పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని సవ్యాఖ్యానంగా మీకు అందించడం తెలుగు పరిశోధన కు సంతోషం.

13 January, 2016

మహాభారత సంబంధ ప్రవచనాలు,గ్రంథాలు,సినిమాలు Information about Mahabharatha

తెలుగు వారికి భాషా సాహిత్య ధార్మిక రంగాల్లో సేవ చేయాలనే సత్సంకల్పంతో పని చేస్తున్న సాయి సేవకులు ఈసారి మహాభారత సంబంధ సమాచారాన్ని (పుస్తకాలు,ప్రవచనాలు,సినిమాలు)  ఒకే దగ్గర అందించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సేవ తెలుగు వారందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న తెలుగుపరిశోధన ఈ సందేశాన్ని కూడా మీకు అందిస్తుంది. దీనిని వినియోగించుకొని తెలుగువారు ఆనందింతురు గాక!


12 January, 2016

పాండురంగ మాహాత్మ్యం (సవ్యాఖ్యానం) Panduranga Mahatmyam Tenali Ramakrishna Kavi

తెనాలి రామకృష్ణకవి రచించిన పాండురంగ మాహాత్మ్యం ప్రౌఢ ప్రబంధం. వ్యాఖ్యాన సహితంగా మీ ముందుకు తెస్తుంది తెలుగు పరిశోధన. ఈ పుస్తకం అంతర్జాలం లో లభించడం అపురూపం. రసికులైన పాఠకులు దీనిని దిగుమతి చేసుకుని, చదివి, ఆనందింతురు గాక.


అనుసరించువారు